Rice: సాధారణంగా చాలామంది అధిక శరీర బరువుతో కనుక బాధపడుతూ ఉన్నట్లయితే డైట్ చేయడం కోసం కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం పూర్తిగా మానేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా రైస్ కూడా ఒకటి. ఇలా మనం రైస్ తీసుకోవడం వల్ల అధిక శరీర బరువు పెరుగుతున్నామని భావించి చాలామంది అన్నం పూర్తిగా మానేస్తూ వాటికి బదులు చపాతి రోటీ వంటి వాటిని తింటూ ఉంటాము. ఇలా డైట్ అనే పేరిట మనం అన్నం తినడం కనుక మానేస్తే బరువు తగ్గడం ఏమో కానీ మరిన్ని అనారోగ్య ప్రయోజనాలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
డైట్ ఫాలో అవుతూ రైస్ తినకుండా ఉండటం వల్ల ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోతాము అనే విషయానికి వస్తే… మనం తీసుకునే రైస్ లో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల మనం తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం అవ్వడమే కాకుండా పేగులు శుభ్రపడటానికి కీలక పాత్ర పోషిస్తాయి. అదేవిధంగా మల బద్ధక సమస్య కూడా లేకుండా ఉంటుంది.రైస్ లో కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అవి కణాలకు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి.
ఇక రైస్ లో ఉండే బి విటమిన్లు మన నాడీ వ్యవస్థను చురుగ్గా మారుస్తాయి.శరీరానికి ప్రధాన ఇంధన వనరు అయిన కార్బోహైడ్రేట్లకు రైస్ గొప్ప శక్తిని కలిగిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు కలిగినటువంటి రైస్ మనం పూర్తిగా మానేయటం వల్ల ఈ ప్రయోజనాలన్నింటిని కోల్పోతాము. అందుకే డైట్ ఫాలో అవుతున్నప్పటికీ రోజుల్లో పగలు ఒక పూట తప్పనిసరిగా కొంత పరిమాణంలో అన్నం తీసుకోవడం ఎంతో మంచిదని చెబుతున్నారు.