మనలో చాలామంది అన్నం, చపాతీలు ఎంతో ఇష్టంగా తింటారు. అయితే కొంతమంది అన్నం, చపాతీలు తినకుండా ఇతర ఆహారాలు తీసుకుంటూ ఉంటారు. ప్రధానంగా బరువు పెరుగుతామనే భయం ఉన్నవాళ్లు ఈ పనులు చేస్తుంటారు. అయితే ఇవి రెండూ తినడం మానేస్తే శరీరంలో మాత్రం ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయని కచ్చితంగా చెప్పవచ్చు.
అన్నం, చపాతీలు తినని వాళ్లలో ఎక్కువమంది మలబద్ధకం బారిన పడే ఛాన్స్ ఉంటుంది. శరీరంలో తగినంత ఫైబర్ లేకపోతే జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. మన శరీరానికి తగినంత కార్బోహైడ్రేట్లు అందితే హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి. కార్బోహైడ్రేట్లు అందని పక్షంలో నిరంతరం అలసట, బలహీనతతో బాధ పడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
బరువు తగ్గాలనుకునే వారు అన్నం మానేసి చపాతీలు తింటే బరువు తగ్గవచ్చు, కానీ చపాతీని ఎక్కువగా నూనె, నెయ్యితో చేసుకుంటే అనవసర కొవ్వులు చేరతాయని గుర్తుంచుకోవాలి. అన్నం, చపాతీలు మానేస్తే, ఇతర ఆహారాలు తీసుకోవలసిన అవసరం ఏర్పడుతుంది, ఇది ఆహారపు అలవాట్లను మార్చడానికి సహాయపడుతుంది. చపాతీలో ఉండే సెలీనియం క్యాన్సర్ కారకాలు శరీరంపై దాడి చేయకుండా ఉపయోగపడుతుంది.
చపాతీల్లో ఉండే అధిక ఐరన్ స్థాయులు శరీరంలో హెమోగ్లోబిన్ లెవెల్స్ ను క్రమబద్ధికరిస్తాయి. చపాతీలు తీసుకోవడం ద్వారా క్యాల్షియం, జింక్, కాపర్, అయొడిన్, మాంగనీస్, సిలికాన్, పొటాషియం.. వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. జింక్, ఇతర ఖనిజాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మార్కెట్లో లభించే గోధుమపిండిలో మైదా కూడా కలిసి ఉంటుంది.