జీవితంలో గెలవాలి అనే తపన అందరిలో ఉంటుంది. కానీ ప్రయత్నించిన అది కొందరికే సాధ్యం అవుతుంది. ప్రయత్నించిన గెలవలేక పోవడానికి పలు కారణాలను అప్పట్లో చాణుక్యుడు చక్కగా తెలియజేశాడు. ఒక అవినీతిపరుడు అయిన రాజకీయ నాయకున్ని ఎన్నుకున్న ప్రజలు కష్టాలు పడవలసిందే. అతను అభివృద్ధిని, ప్రజలను వదిలేసి తన స్వలాభం చూసుకుంటాడు.
ఒక నిజాయితీ లేని స్నేహితుడిని అస్సలు నమ్మకూడదు. కాబట్టి అవినీతిపరులకు, నిజాయితీ లేని వారికి, జ్ఞానం లేని వారికి దూరంగా ఉండటమే ఉత్తమం. చాణిక్య నీతి ప్రకారం పాముకు, తేలుకు కొర్రల్లో విషం ఉంటుంది. కానీ ఒక దుర్మార్గుడికి శరీరమంతా విషమే ఉంటుంది. ఏ చిన్న అవకాశం దొరికినా పక్క వారిని నాశనం చేసేందుకు సిద్ధపడతాడు. అటువంటి వారికి దూరంగా ఉండాలి.
మనకు ఎక్కడ అయితే గౌరవం లభిస్తుందో, ఎక్కడైతే జీవన ఉపాధి అవకాశాలు దొరుకుతాయో అటువంటి చోటనే ఉండాలని చాణిక్యుని నీతి. గౌరవం, అవకాశాలు లేని చోట మనిషి గెలవడం కష్టం.నెగటివ్ గా ఆలోచించే వాళ్ళతో అస్సలు మాట్లాడలేం ఎందుకంటే పండితుడు కూడా అవివేకి కి పాఠాలు చెప్పి మార్చలేడు. మారాలి అని తనకు లేకుంటే ఎవరు చెప్పినా మారడు కాబట్టి అటువంటి వారి దగ్గర మన జ్ఞానాన్ని, కాలాన్ని వృధా చేసుకోకుండా వారితో ఎలాంటి విషయాలు చర్చించకూడదు.
నేను మాత్రమే గెలవాలి, నాకు అంతా తెలుసు అని భ్రమలో ఉండకూడదు. సామంతులు, మంత్రులు లేని రాజ్యం ఎక్కువ రోజులు నిలవదు. అలాగే నీ ఆలోచనలో మార్పు రావాలన్నా, నీ కష్టాన్ని ఇతరులతో పంచుకోవాలన్న నీకంటూ కొందరు ఉండాలి. మనకు తెలిసిన రహస్యాలను ఎవరికి పడితే వారితో చర్చించకూడదు. వారు ఇతరులకు చెప్పే అవకాశం ఉంది. మనం కూడా వేరే వాళ్ళ రహస్యాలను ఇతరులకు చెప్పకూడదు.
అది ఒక రకంగా మోసం అవుతుంది. ఇలాంటి అలవాటు ఉంటే ఏదో ఒక రోజు సమాజంలో నమ్మకం అనేది కోల్పోతాం. దుష్టులకు దూరంగా ఉండాలి. దుష్టుని కంటే పాము నయం ఎందుకంటే పాము హాని ఉంటేనే కాటు వేస్తుంది కానీ దుష్టుడు తన చెడు ఆలోచనలతో ఇతరులను పక్కదారి పట్టిస్తుంటాడు, ఇలాంటి వారితో చాలా ప్రమాదం.