సంతోషంగా ఉండాలంటే ఇద్దరి మధ్య ప్రేమ ఒక్కటే ఉంటే సరిపోదు… ఇవి కూడా ఉండాల్సిందే!

సాధారణంగా ఇద్దరు వ్యక్తులు ఏ రిలేషన్ లో ఉన్న అతి ప్రేమికులైన భార్యాభర్తలైన అన్నా చెల్లెలు అయిన ఇద్దరి మధ్య ఉన్నటువంటి బంధం మరింత బలపడాలి అంటే ప్రేమ ఒక్కటే ఉంటే సరిపోదని ప్రేమతో పాటు మరికొన్ని కూడా ఉండటం వల్ల ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ బంధం మరికొన్ని రోజులు ఎంతో సంతోషంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. మరి చాలామంది ఇద్దరు వారి జీవితంలో సంతోషంగా ఉండాలంటే వారి మధ్య ప్రేమ ఒక్కటే ఉంటే చాలని ఏవి లేకపోయినా సంతోషంగా ఉంటారనీ చెబుతారు.

కానీ ఇద్దరు వ్యక్తులు ఒక రిలేషన్ లో ఉన్నప్పుడు ప్రేమ మాత్రమే కాకుండా ప్రేమతో పాటు ఈ విషయాలు కూడా తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి అయితే ప్రేమతో పాటు ఇంకా ఒకరికొకరు ఎంతో గౌరవం ఇచ్చిపుచ్చుకున్నప్పుడే మీ బంధానికి కొంత వాల్యూ ఉంటుంది.మనం రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ఒకరికొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకుంటేనే మన రిలేషన్ నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటుంది.

స్వేచ్ఛ స్వాతంత్రం కూడా ఇద్దరి మధ్య ఎంతో అవసరం.మీరు మీ ప్రేమించే వ్యక్తులపై పూర్తి హక్కుల మీరే తీసుకోకుండా వారికి అంటూ కొంత స్వేచ్ఛ స్వాతంత్రం కల్పించాలి వారికి సంబంధించిన విషయాలపై పూర్తిగా హక్కులు వారికే ఉంటాయి కనుక ఆ విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛను కల్పించాలి. ఇక ఏ బంధమైనా నిండు నూరేళ్లు సంతోషంగా సాగిపోవాలి అంటే నమ్మకం కూడా ఎంతో ముఖ్యమైనది. ఒకరిపై మరొకరికి నమ్మకం ఉన్నప్పుడే ఆనందం పది కాలాలపాటు చల్లగా ఉంటుంది. ఇలా ప్రేమ ఒక్కటే కాకుండా గౌరవం నమ్మకం స్వేచ్ఛ అనేది ఉన్నప్పుడే ఆ బంధం ఎంతో సంతోషంగా ఉంటుంది.