స్పామ్ కాల్స్ తలనొప్పిగా మారాయా… ఇలా ఉపశమనం పొందండి..?

ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం రోజురోజుకి పెరిగిపోతుంది. టెక్నాలజీ అభివృద్ధి చెందడం వల్ల కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను తయారు చేసి మార్కెట్లో విడుదల చేస్తున్నారు. అయితే ఈ టెక్నాలజీ మంచి పనులకు ఎంత ఉపయోగపడుతుందో..ఈ టెక్నాలజీని ఉపయోగించి ఎంతోమంది సైబర్ నేరగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది సైబర్ నేరగాళ్లు ఫ్రాడ్ కాల్స్ చేస్తూ డబ్బు దోచుకుంటున్నారు. అంతే కాకుండా కొన్ని సందర్భాలలో స్పామ్ కాల్స్ వల్ల వినియోగదారులు చాలా విసిగిపోతున్నారు. నిజానికి ఎక్కువ స్పామ్‌ కాల్స్‌ వినియోగదారులను మోసం చేసేవే ఉంటాయి.

ముఖ్యంగా వ్యక్తిగత లోన్స్‌, జాబ్‌ ఆఫర్స్‌ అంటూ కాల్స్‌ చేస్తూ యూజర్లను తప్పు దారి పట్టిస్తూ మోసం చేస్తున్నారు. అయితే ఇలాంటి కాల్స్‌ రాకుండా ఉండడానికి అన్ని టెలికాం సంస్థలు డీఎన్డీ(DND) ఆప్షన్ ఇచ్చాయి. అయితే దీనిని యాక్టివేట్ చేసుకోవటం చాలా మందికి అవగాహన ఉండదు. మీ మొబైల్ ఫోన్ లో డీఎన్డీ ఆప్షన్ ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

• డీఎన్డీ ఆప్షన్ ని ఆక్టివేట్ చేయడానికి మీ ఫోన్‌లో డిఫాల్ట్ మెసేజింగ్ యాప్‌ని ఓపెన్ చేయాలి
• అక్కడ FULLY BLOCK అని కేపిటల్ లెటర్స్ లో టైప్ చేసి, టోల్ ఫ్రీ నంబర్ 1909కి పంపండి.
• ఇలా చేయటం వల్ల మీకు టెలీమార్కెటింగ్ కు సంబంధించిన స్పామ్ కాల్స్, మెసేజ్ రాకుండా నియంత్రించవచ్చు .
• అలాగే ఇంకా కొన్ని కోడ్లను వినియోగించి మిగిలిన స్పామ్ కాల్స్ కూడా రాకుండా చూసుకోవచ్చు.
• అన్ని స్పామ్ కాల్స్, మెసేజ్ లను బ్లాక్ చేయడానికి FULLY BLOCK అని టైప్ చేసి మెసేజ్ పంపాలి.
• ఇక బ్యాంకింగ్, ఇన్యూరెన్స్, క్రెడిట్ కార్డు, ఆర్థికపరమైన ఉత్పత్తులకు సంబంధించిన ప్రోమోషనల్ మెసేజ్ లు కాల్స్ ను బ్లాక్ చేయడానికి BLOCK 1 అని టైప్ చేయాలి.
• అలాగే రియల్ ఎస్టేట్ కు సంబంధించిన కాల్స్ రాకుండా ఉండాలంటే BLOCK 2 అని టైప్ చేయాలి.
• ఇక విద్యాపరమైన స్పామ్ కాల్స్ ను నిరోధించడానికి BLOCK 3, హెల్త్ విషయమైన కాల్స్ ని బ్లాక్ చేయడానికి BLOCK 4, ఆటోమొబైల్, ఐటీ, వినోదానికి సంబంధించిన ప్రోమోషల్ కాల్స్ నిరోధించడానికి BLOCK 5 అని టైప్ చేసి మెసే్ పంపాలి.
• అలాగే బ్రాడ్ కాస్టింగ్, కమ్యూనికేషన్ వంటి వాటిపై BLOCK 6 అని, టూరిజమ్, బెవరేజెస్ వంటి వాటిని బ్లాక్ చేయడానికి BLOCK 8 అని టైప్ చేసి 1909 నంబర్ కి మెసేజ్ చేయాలి.