ఆ సిమ్ కార్డ్ వాడే కస్టమర్లకు భారీ షాకింగ్ న్యూస్.. ఎక్కువ ఖర్చు చేయాల్సిందే!

Voda-Idea weighs fundraising

మన దేశంలో ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో వినియోగదారులు జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, బీ.ఎస్.ఎన్.ఎల్ సిమ్ లను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ప్రైవేట్ టెలీకాం కంపెనీలు రీఛార్జ్ చేసే మొత్తాన్ని భారీగా పెంచుతూ కస్టమర్లకు భారీ షాకులిచ్చిన సంగతి తెలిసిందే. వొడాఫోన్ ఐడియా 99 రూపీస్ ప్లాన్, 128 రూపీస్ ప్లాన్ వ్యాలిడీటీని తగ్గించి కస్టమర్లకు దిమ్మతిరిగే షాకిచ్చింది.

 

వొడాఫోన్ ఐడియా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కస్టమర్లపై అదనపు భారం పడనుంది. యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ ను పెంచుకోవడం కోసం వొడాఫోన్ ఐడియా ఈ షాకింగ్ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం ముంబై సర్కిల్ కు మాత్రమే ఈ నిబంధనలు వర్తించనుండగా రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాల్లో సైతం ఈ నిబంధనలు అమలులోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు.

 

99 రూపాయల ప్లాన్ 28 రోజుల నుంచి 15 రోజులకు తగ్గగా ఈ ప్లాన్ బెనిఫిట్స్ లో ఎలాంటి లేదని సమాచారం అందుతోంది. 128 రూపాయల ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజుల నుంచి 18 రోజులకు తగ్గింది. వొడాఫోన్ ఐడియాకు సంబంధించి ఇతర ప్లాన్స్ లో మాత్రం ఎలాంటి మార్పు లేదని బోగట్టా. వొడాఫోన్ ఐడియా బాటలో ఇతర టెలీకాం కంపెనీలు నడుస్తాయో లేదో చూడాల్సి ఉంది.

 

వొడాఫోన్ ఐడియా ప్లాన్ టారిఫ్స్ లో మార్పులు చేయగా టెలీకాం కంపెనీలు టారిఫ్ ప్లాన్స్ ను భారీగా పెంచితే మాత్రం ప్రజలపై ఊహించని స్థాయిలో భారం పడుతుందని చెప్పవచ్చు. దేశంలో డేటా వినియోగం పెరగడంతో ప్రజలు టారిఫ్ ప్లాన్స్ కోసం ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి వస్తోంది.