భార్యాభర్తల బంధం బలోపేతం కావాలంటే ఈ విషయాలను పాటించాల్సిందే!

11_05_424273317chanakya-nit3

భార్యాభర్తలు అన్న తర్వాత గొడవలు పోట్లాటలు రావడం సర్వసాధారణం అయితే ఎప్పుడూ కూడా ఈ గొడవలను ప్రతిసారి భూతద్దంలో చూస్తూ ఉండటం వల్ల ఇద్దరి మధ్య ఏమాత్రం బంధం బలోపేతం కాదు అందుకే భార్య భర్తల మధ్య బంధం బలోపేతం కావాలంటే తప్పనిసరిగా కొన్ని విషయాలను తప్పనిసరిగా పాటించాలని ఆచార్య చాణిక్యతను నీతి గ్రంధం ద్వారా తెలియజేశారు. మరి చాణిక్యుడు చెప్పిన ఆ నీతి సూత్రాలు ఏంటి అనే విషయానికి వస్తే…

ప్రేమ,అంకిత భావం,ఒకరిని ఒకరు గౌరవించుకోవడం, స్వార్థం ఉండకపోవడం ఈ నాలుగు సూత్రాలు అవసరం. ఏ బంధానికైనా ప్రేమ అవసరం అది లేకపోతే ఏ బంధం కూడా నిలబడలేదు. భార్యాభర్తల బంధం దీనికి అతీతం కాదు. దంపతులకి ఒకరిమీద ఒకరు ప్రేమ ఉండాలి. ఒకరు ప్రేమ చూపించి ఇంకొకరు ప్రేమ చూపించకపోతే కూడా బంధం నిలబడదు. భార్యా మీద భర్తకి,భర్త పట్ల భార్యకి అకింత భావం ఉండాలి. ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నాం అన్నట్టు కాకుండా అంకిత భావం ఉండాలి. దంపతులు ఒకరినొకరు గౌరవించుకోవాలి.

భార్యాభర్తలు ఇద్దరూ పనులు చేస్తున్నప్పటికీ ఇద్దరు కూడా సరి సమానమని భావించాలి. ఎప్పుడూ కూడా భార్య భర్తల మధ్య నేను ఎక్కువ నువ్వు తక్కువ అనే భేదాభిప్రాయాలు రాకూడదు ఎప్పుడైతే ఇలాంటి పేద అభిప్రాయాలు వస్తాయో అప్పుడే వారి మధ్య బంధం బీటలు బారుతుంది.అందుకే భార్యాభర్తలు ఎప్పుడూ కూడా ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు గౌరవ మర్యాదలు ఒకరిపై మరొకరికి నమ్మకం సమానత్వం అనేది ఉండాలి ఇవి ఉన్నప్పుడే భార్యాభర్తల మధ్య బంధం మరింత బలపడుతుంది.