భార్యాభర్తల లైంగిక జీవితంలో ఈ మార్పులు మంచివే!

how-to-have-a-healthy-sex-life-four-important-facts

పెళ్లయిన కొత్తలో ప్రతి ఒక్కరు కూడా శృంగార జీవితం పట్ల చాలా ఆసక్తిగా ఉంటారు ఇలా శృంగారం పై ఆసక్తి ఉంటూ నిత్యం తన జీవిత భాగస్వామికి దగ్గరగా ఉండాలని కోరుకుంటారు అయితే పెళ్లయిన కొద్ది రోజులకు సెక్స్ జీవితంపై ఆసక్తి తగ్గుతూ ఉంటుంది. ఇలా శృంగార జీవితం పట్ల ఆసక్తి తగ్గిపోవడంతో కొన్ని సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయి అయితే ఇలా తిరిగి శృంగారం పట్ల ఆసక్తి రావాలంటే మన లైంగిక జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవడం ఎంతో మంచిది.

పెళ్లయిన కొన్ని సంవత్సరాలకు భార్యాభర్తల మధ్య లైంగిక జీవితం పట్ల ఆసక్తి తగ్గిపోతూ ఉంటే వారు తమ లైంగిక జీవితం కోసం ఒక షెడ్యూల్ తయారు చేసుకోవాలి. ఇలా లైంగిక జీవితం పట్ల షెడ్యూల్ తయారు చేసుకున్నప్పుడు ఇతర పనులు ఆ షెడ్యూల్ పై ప్రభావాన్ని చూపవు తద్వారా భార్యాభర్తల మధ్య తిరిగి అన్యోన్యత పెరుగుతుంది. ఇక మీ భార్య సెక్స్ పట్ల ఆసక్తి చూపకపోతే మీరు తన వెంటపడి తనని విసిగించకూడదు.

ఇలా చేయడం వల్ల కొన్నిసార్లు మీ భార్య తీవ్ర నిరుత్సాహానికి గురికావాల్సి ఉంటుంది. అందుకే మాటిమాటికి తన వెంట అస్సలు పడకూడదు. ఒకవేళ మీ భార్య లైంగికంగా మీతో కలవడానికి ఆసక్తి లేకపోతే తనంతట తానే మీతో లైంగికంగా కలవడానికి ఆసక్తి చూపేలా మీరు వ్యవహరించాల్సి ఉంటుంది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడానికి కేవలం లైంగిక జీవితం ఒక్కటే మార్గం కాదని ఇద్దరు కొన్ని సమయాలలో మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడం ఒకరినొకరు హగ్ చేసుకోవడం ముద్దులు పెట్టుకోవడం వల్ల కూడా తిరిగి ఒకరిపై మరొకరికి ప్రేమ కలుగుతుంది. ఇలా లైంగిక జీవితంలో ఇలాంటి చిన్న చిన్న మార్పులు రావడం కూడా ఎంతో మంచిది..