సాధారణంగా మనం ఏదైనా రెస్టారెంట్ కు వెళ్లిన లేదా ఇంట్లో నాన్ వెజ్ ఆహార పదార్థాలను తిన్న పళ్ళల్లో మనకు మాంసాహారం చిక్కుకోవడం సర్ప సాధారణం అయితే ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనం టూత్ పిక్ సహాయంతో పళ్ళలో ఇరుక్కున్నటువంటి ఆహార పదార్థాలను బయటకు తొలగిస్తాము. ఇక చాలామంది రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు మనకు టూత్ పిక్ నుఅందించడం మనం చూస్తుంటాం అయితే టూత్ పిక్ ఎప్పుడైనా గమనించి ఉంటే కింద చాలా షార్ప్ గా ఉండి పైన వివిధ ఆకారాలతో చెక్కబడి ఉంటుంది.
ఇలా టూత్ పిక్ కు పైన ఎందుకు ఇలాంటి ఆకారాలలో చెక్కబడి ఉంటుందో ఎప్పుడైనా గమనించారా.. అసలు అలా పెట్టడానికి గల కారణం ఏంటి ఎందుకు అలా చెక్కబడి ఉంది అనే విషయానికి వస్తే… చాలామంది ఆహారం తిన్న తర్వాత పళ్ళలో ఇరుకున్న ఆహార పదార్థాలను బయటకు తీయడానికి ఈ టూత్ పిక్ ఉపయోగిస్తారు.అయితే కొన్నిసార్లు ఏదైనా పని నిమిత్తం వెళ్లినప్పుడు దానిని కింద పడితే తిరిగి మరోసారి ఉపయోగించలేము.
మనం ఏదైనా చిన్న పని పడి టూత్ పిక్ పక్కన పెట్టాల్సి వచ్చినప్పుడు దాని వెనుక భాగాన్ని కాస్త తుంచి ఒక టేబుల్ పై పెట్టి దానిపైన టూత్ పిక్ పెట్టవచ్చు. ఇలా చేయటం వల్ల టూత్ పిక్ కింద పడదు. తద్వారా తిరిగి మనం ఆ టూత్ పిక్ ఉపయోగించవచ్చు. అందుకోసమే టూత్ పిక్ వెనక భాగంలో ఇలా చెక్కబడి ఉంటుంది.