కంగువ సినిమా అందుకే పోయిందంటున్న కో ప్రొడ్యూసర్.. ఆ రీజన్ సరికాదంటున్న ప్రేక్షకులు!

తమిళ నటుడు సూర్య హీరోగా, దిశపఠాని హీరోయిన్ గా డైరెక్టర్ శివ దర్శకత్వం వహించిన సినిమా కంగువ. ఈ సినిమా నవంబర్ 14న విడుదలైంది. 350 కోట్ల భారీ బడ్జెట్ తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిందని చెప్పాలి. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ చిత్రం మెగా డిజాస్టర్ గా నిలిచింది. సగటు సినీ అభిమాని విషయం పక్కన పెడితే సూర్య వీరాభిమానులకు సైతం ఈ సినిమా ఏ మాత్రం నచ్చకపోవటం గమనార్హం. దీనికి తోడు ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ పెద్ద మైనస్ అంటున్నారు ప్రేక్షకులు.

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి వచ్చిన కంప్లైంట్ తో ప్రొడ్యూసర్ సినిమా హాల్స్ లో వాల్యూమ్ ని రెండు పాయింట్లు తగ్గించమని ఎగ్జిబిటర్స్ కి విజ్ఞప్తి చేశారని సమాచారం. దానికి తోడు కథలో కూడా పెద్దగా కంటెంట్ లేకపోవడం వలన ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. కథలో లోపాలున్నట్లు జ్యోతిక కూడా అంగీకరించింది. అయితే సినిమా కో ప్రొడ్యూసర్ అయిన ధనుంజయ్ మాట్లాడుతూ సినిమా ఫలితాలపై తమ టీం సంతృప్తిగా లేదని చెప్పుకొచ్చాడు.

తన సినిమా కంగువని కావాలనే టార్గెట్ చేశారని చెప్పుకొచ్చాడు. సూర్య ఎదగడం ఇష్టం లేని కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కావాలనే సినిమాపై నెగిటివిటీని స్ప్రెడ్ చేశారు, అలాగే అజిత్ ఫ్యాన్స్ కూడా సూర్య అభివృద్ధిని చూడలేక కావాలనే సినిమా తొక్కేశారు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే అతని కామెంట్స్ ని కొట్టి పారేస్తున్నారు ప్రేక్షకులు. సినిమాలో కధ, కంటెంట్ బాగుంటే ఎవరు ఎంతగా తొక్కేయాలని చూసినా సినిమాని ఎవరూ ఫ్లాప్ చేయలేరు.

సినిమాలో లోపాలు పెట్టుకొని ఎదుటి వాళ్ళని విమర్శిస్తే ఏం ప్రయోజనం, ప్రొడ్యూసర్లు ఇప్పటికైనా వాస్తవంలోకి వచ్చి ఆలోచిస్తే సినిమా విఫలమవ్వటానికి కారణాలు అర్థం అవుతాయి అంటున్నారు. అయితే సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం తో ఓటిటి రైట్స్ పై అందరూ ఆసక్తి చూపించారు. అయితే ప్రముఖ ఓటిటి దిగ్గజం అమెజాన్ ప్రైమ్ 100 కోట్లకు డీల్ కుదుర్చుకొని ఓటీటీ రైట్స్ దక్కించుకుంది. డిసెంబర్ ఆఖరి వారంలో ఈ సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం.