ఆన్సర్ పర్సనల్గా చెప్తానంటున్న రష్మిక.. త్వరలో గుడ్ న్యూస్ ఎక్స్పర్ట్ చేయొచ్చా!

కలిసి సినిమాలు చేసినా చేయకపోయినా కొన్ని జంటలు మాత్రం నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటారు.అలాంటి వారిలో రష్మిక, విజయ్ దేవరకొండల జంట ముందుంటుంది. వాళ్ళిద్దరూ ఏం చేసినా వైరల్ అయిపోతూ ఉంటారు. ఈ మధ్యనే ఇద్దరు కలిసి ఒక రెస్టారెంట్లో కలిసి తింటున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎప్పటికప్పుడు వారిద్దరూ మేము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అంటూ చెప్పుకొస్తున్నప్పటికీ వారు సోషల్ మీడియాలో పెట్టే ఫోటోలను చూస్తే మాత్రం మేము రిలేషన్ లో ఉన్నాము అని చెప్పకనే చెప్తున్నట్లుగా అనిపిస్తుంది.

ఇప్పుడు లేటెస్ట్ గా మళ్లీ ఈ జంట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే నిన్న చెన్నైలో జరిగిన పుష్ప 2 ఈవెంట్ లో మీరు ఇండస్ట్రీ కి సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా అని యాంకర్ రష్మిక ని ప్రశ్నించగా దీనికి సమాధానం అందరికీ తెలిసిందే కదా మళ్లీ నేను ప్రత్యేకించి సమాధానం చెప్పనవసరం లేదు అంది ఈ బ్యూటీ. ఆ సమాధానికి అక్కడే ఉన్న శ్రీలీల, అల్లు అర్జున్ పడి పడి నవ్వారు. అయితే ఆశ్చర్యపోయిన యాంకర్ అందరికీ తెలిసేమో కానీ నాకు తెలియదు.

ఎవరిని పెళ్లి చేసుకుంటారో చెప్పండి అని మళ్ళీ అడగగా నీకు పర్సనల్ గా చెప్తానులే అంటూ ఆన్సర్ దాటేసింది. ఈ ఇన్సిడెంట్ జరగటానికి కొన్ని రోజుల ముందు విజయ్ దేవరకొండ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అక్కడ యాంకర్ మీరు సింగిలా, కమిటెడా అని ప్రశ్నించగా నాకు 35 సంవత్సరాలు వచ్చాయి ఇంకా సింగిల్ గా ఉంటానని ఎందుకు అనుకుంటున్నారు అని సమాధానం ఇవ్వడంతో షాక్ అవ్వటం యాంకర్ వంతయింది.

విజయ్ దేవరకొండ రష్మిక గురించే మాట్లాడాడు అని అందరూ అనుకుంటున్నారు. వాళ్ల అనుమానాలని నిజం చేస్తూ అప్పుడప్పుడు ఇద్దరూ కలిసి మీడియా కంట పడుతూ ఉంటారు ఈ జంట. రష్మిక ఎప్పటినుంచో పండగలన్ని విజయ్ దేవరకొండ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంది. వీళ్ళిద్దరి దగ్గర నుంచి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు సినీ వర్గాల వారు.