Milk: పాలు త్రాగటం మన ఆరోగ్యానికి ఎంతో మంచిదనే విషయం మనకు తెలిసిందే. పాలలో ఎన్నో ప్రోటీన్స్, విటమిన్స్ ఉండటం వల్ల మన శరీరానికి ప్రోటీన్ లను కాల్షియం వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఇలా పాలు ఆరోగ్యానికి మంచిది కావడంతో చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారు వరకు కూడా పాలను తాగుతూ ఉంటారు. అయితే చిన్న పిల్లల విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది.చాలామంది పిల్లలు ఉదయం స్కూల్ కి వెళ్లేటప్పుడు సరిగా బ్రేక్ ఫాస్ట్ చేయరు.
ఈ విధంగా పిల్లలు బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడంతో పాలతో పాటు మరికొన్ని ఆహార పదార్థాలను వెంటవెంటనే తినిపిస్తుంటారు కానీ పాలు తాగిన వెంటనే కొన్ని రకాల పదార్థాలను తినక పోవడమే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు మరి పాలు తాగిన వెంటనే పిల్లలకు ఎలాంటి ఆహార పదార్థాలను తినిపించకూడదు అనే విషయానికి వస్తే..చాలామంది ఉదయం ఒక గ్లాస్ పాలతో పాటు ఒక బాయిల్ ఎగ్ తింటూ ఉంటారు. ఇలా పాలతో పాటు గుడ్డు తినిపించడం ఏమాత్రం మంచిది కాదు.
పాలు తాగిన వెంటనే గుడ్డు, మాంసం వంటి పదార్థాలను తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఎందుకంటే మాంసం గుడ్లు పాలలో అధిక శాతం ప్రోటీన్లు ఉండటం వల్ల జీర్ణ క్రియలు సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ఈ విధమైనటువంటి ఆహార పదార్థాలను తినిపించకూడదు. ఇక పాలు తాపించిన వెంటనే పెరుగన్నం కూడా తినిపిస్తూ ఉంటారు లేదా పెరుగన్నం తిన్న వెంటనే పాలు కూడా తాపిస్తుంటారు. ఇలా చేయటం వల్ల తవ్రమైనటువంటి కడుపునొప్పి వాంతులు విరేచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి కనుక పాలు తాగిన వెంటనే ఈ పదార్థాలను అసలు తినిపించవద్దు.