విటమిన్ బీ12 లోపం లక్షణాలు ఇవే.. శాఖాహారులు ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు!

మాంసాహారం తినేవాళ్లతో పోల్చి చూస్తే శాఖాహారం తినేవాళ్లను కొన్ని ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. అలసట, బలహీనత, వికారం, నోటి పూతలు, పసుపు రంగు చరం విటమిన్ బీ12 లోపానికి సంబంధించిన లక్షణాలు అని చెప్పవచ్చు. ఈ లోపంతో ఉండే వాళ్లలో కొన్నిసార్లు వికారం, వాంతులు లేదా అతిసారం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు కూడా ఉండవచ్చు.

నాలుక నొప్పి, అలాగే నాలుక ఎర్రబడటం కూడా లోపం యొక్క లక్షణంగా ఉండవచ్చు. ఈ లోపంతో బాధ పడేవాళ్లలో చేతులు మరియు కాళ్ళలో తిమ్మిరి లేదా జలదరింపు కూడా ఉండవచ్చు. ఈ లోపం వల్ల కొన్ని సందర్భాల్లో చర్మానికి పసుపు రంగు రావచ్చు. కొన్నిసార్లు బరువు తగ్గడం కూడా లోపం యొక్క లక్షణంగా ఉండవచ్చు. దృష్టి సమస్యలు కూడా విటమిన్ బీ12 లోపం వల్ల తలెత్తే ఛాన్స్ ఉంది.

విటమిన్ బ్12 లోపం వల్ల జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రత లోపాలు కూడా రావచ్చు. విటమిన్ బి12 అనేది మీ శరీరం ఎర్ర రక్త కణాలు, డీ.ఎన్.ఏను తయారు చేయడంలో అవసరమైన ముఖ్యమైన పోషకం అని చెప్పవచ్చు. మాంసం, పాల ఉత్పత్తులు, గుడ్లు తీసుకోవడంద్వారా శరీరానికి అవసరమైన బీ12 లభిస్తుంది. బీ12 ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ తీసుకోవడం ద్వారా కూడా మంచి ఫలితాలు ఉంటాయి.

విటమిన్ బి12 లోపం వల్ల మీ శరీరంలో తగినంత ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు లేనప్పుడు విటమిన్ బి12 లోపం వల్ల రక్తహీనత వస్తుంది. ఏ వయసులోనైనా ఎవరికైనా విటమిన్ బి12 లోపం రావచ్చు. ఇతర వయసు వర్గాలతో పోలిస్తే 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో విటమిన్ బి12 లోపం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.