సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులు తమ భవిష్యత్తు కోసం నెలవారీ జీతం నుండి కొంత డబ్బు ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) అకౌంట్ లో జమ చేస్తారు. ఈ పిఎఫ్ మొత్తానికి ప్రతి ఏడాది వడ్డీ జమవుతుంది. అత్యవసర సమయాల్లో ఈ ఖాతా నుంచి పాక్షికంగా నగదు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఉద్యోగి ఏదేని అనారోగ్యం బారిన పడినప్పుడు, ఇంటి అవసరాలు వంటి అత్యవసర సందర్భాల్లో నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే అర్ధాంతరంగా ఉద్యోగి మరణిస్తే.. పీఎఫ్ అమౌంట్ ఏమవుతుంది..? అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగి మరణించిన తర్వాత పిఎఫ్ డబ్బులు డ్రా చేసే హక్కు ఎవరికి ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఉద్యోగులు వారి మరణం తర్వాత పీఎఫ్ డబ్బులు ఎవరికి వెళ్లాలనే అంశాన్ని ముందుగానే ఆలోచించుకోవాలి. అంటే పిఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసిన సమయంలో ఉద్యోగి తమ కుటుంబ సభ్యులను నామినిగా ఉంచి వారి వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది . ఉద్యోగి మరణించిన తర్వాత అతని పిఎఫ్ డబ్బులు నామినీగా ఉన్న వారు విత్ డ్రా చేసే అవకాశం ఉంటుంది. అయితే ఒకసారి నామిని వివరాలు పొందుపరిచిన తర్వాత మరొకసారి ఆ వివరాలలో మార్పులు చేసే అవకాశం కూడా ఉంటుంది. నామినీ వివరాలను ఎన్ని సార్లైనా సవరించుకోవచ్చు. ఈపీఎఫ్‌వో వెబ్ సైట్ ద్వారా ఈ-నామినేషన్ సదుపాయం అందిస్తోంది. ఈ-నామినేషన్ చేయడం ద్వారా ఖాతాదారుడు రిటైర్మెంట్‌కి ముందు మరణిస్తే EDLI పథకం కింద PF ఖాతాలో మొత్తాన్ని నామినీ క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఈ-నామినేషన్ చేయు విధానం :
• ముందుగా ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్ epfindia.gov.in ఓపెన్ చేయాలి.
• ఆ తర్వాత యూఏఎన్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.
• మేనేజ్ ట్యాబ్ కిందనున్న ‘E-nomination’ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.
• ‘Provide Details’ ట్యాబ్‌ను నొక్కి, ‘Save’పై క్లిక్ చేయాలి.
• ఫ్యామిలీ డిక్లరేషన్ అప్‌డేట్ కోసం యెస్ ఆప్షన్ పై నొక్కాలి.
• ఇక ఇప్పుడు ఈ-నామినేషన్ చేసే వారి ఆధార్ నెంబర్, పేరు, పుట్టిన తేదీ, జెండర్, రిలేషన్, అడ్రస్, బ్యాంకు అకౌంట్ వివరాలు(ఆప్షనల్), గార్డియన్, పాస్‌పోర్టు సైజు ఫోటో వంటిని నమోదు చేయాలి.
• అయితే ఒకరి కంటే మరింత మంది నామినీలను యాడ్ చేసుకునేందుకు ‘Add Family Details’ను నొక్కాలి.
• ‘Nomination Details’పై క్లిక్ చేసి, ‘Save EPF Nomination’పై నొక్కాలి.
• ఈ-సైన్ కోసం ఆధార్‌తో లింకైన మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది.
• ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీ ఈ-నామినేషన్ ప్రాసెస్ ను కంప్లీట్ చేయొచ్చు.