పీఎఫ్ ఖాతాదారులు అలర్ట్…పీఎఫ్ డబ్బులు డ్రా చేయాలనుకుంటున్నారా వీటిని సమర్పించాల్సిందే!

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగుల కోసం అందిస్తున్న సేవలను మరింత పొడిగింపు చేస్తుంది. అదేవిధంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పీఎఫ్‌ నగదును విత్ డ్రా చెయ్యడానికి… నామినీ తదితర వివరాలను అప్డేట్ చేయాలన్నా కూడా ఇకపై ఆన్లైన్ ద్వారానే ఈ అప్డేట్స్ అన్ని కూడా మనం ఎంత సులభంగా చేసుకోవచ్చు.సాధారణంగా ప్రావిడెంట్ ఫండ్ ఒక ఉద్యోగి రిటైర్డ్ అయిన తర్వాత ఆ డబ్బులు డ్రా చేస్తారు.

కొందరు వైద్య ఖర్చుకు, వివాహాలు, చదువుల నిమిత్తం మధ్యలోనే లోన్ తీసుకొని డబ్బులను డ్రా చేస్తూ ఉంటారు. ఇలా ఉద్యోగి రెండు నెలలకు పైగా నిరుద్యోగిగా ఉన్నా సరే డబ్బులని విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే మీరు కనుక ఈ డబ్బులని డ్రా చెయ్యాలని చూస్తుంటే కొన్ని పత్రాలు అప్డేట్ చేయడం అవసరం.వీటి హెల్ప్ తో మీరు డబ్బులని తీసుకోవచ్చు. అయితే కొన్ని అవసరం అవుతాయి.

ఇక వాటి వివరాలను చూస్తే.. రెండు రెవెన్యూ స్టాంపులు కావాలి. వీటితోపాటు కంపోసిట్‌ క్లయిమ్‌ ఫామ్‌, బ్యాంక్ ఖాతా వివరాలు ఉండాలి. గుర్తింపు కార్డు, చిరునామా వివరాలు, బ్యాంకు IFSC కోడ్ ఉండాలి. వ్యక్తిగత వివరాలు కూడా ఇవ్వాల్సి వుంది. ఉద్యోగం చేసే సమయంలో లేదా విరమణకు 5 సంవత్సరాల ముందు పీఎఫ్ విత్‌డ్రా డీటెయిల్స్ ని కూడా ఇవ్వాల్సి వుంది. PF ఖాతాలో జమ చేసిన మొత్తానికి ఉన్న వివరాలు, ఫారమ్ 2, 3 కావాలి. వీటన్నింటిని సమర్పించి మనం పిఎఫ్ డబ్బులను డ్రా చేసుకోవచ్చు.