కలలో పీడ కలలు వస్తున్నాయా.. దిండు కింద ఈ వస్తువులను పెడితే చాలు!

సాధారణంగా మనం పగలు లేదా రాత్రి సమయంలో నిద్ర పోతున్నప్పుడు కలలు రావడం సర్వసాధారణం.అయితే కొన్నిసార్లు కలలో మనకు మంచి జరిగినట్టు వస్తుంటుంది. అలాగే కొన్నిసార్లు చెడు కూడా జరిగినట్లు కలలు వస్తుంటాయి. అయితే కొన్నిసార్లు మనకు వచ్చే కలల ద్వారా మనకు శుభం జరగబోతుందని లేదా చెడు జరగబోతుందని సంకేతానికి కూడా కలలు వస్తుంటాయని చెబుతుంటారు.ఇకపోతే మనం పగలు లేదా నిద్రపోయే ముందు దేని గురించైనా ఎక్కువగా ఆలోచించి పడుకున్న సమయంలో వాటి గురించి కలలు రావడం జరుగుతుంది.

ఇకపోతే కొందరికి తరచూ కలలో భయంకరమైన పీడకలలు వస్తుంటాయి. ఇలా పీడకలలు కలలోకి రావడంతో ఏం జరుగుతుందోనని చాలామంది ఎంతో ఆందోళన చెందుతూ ఉంటారు. ఇలా తరచూ పీడకలలు వస్తున్న వారు మనకు కలలో పీడకలలు రాకుండా ఉండాలంటే దిండు కింద ఈ వస్తువులను పెట్టుకొని పడుకుంటే పీడకలలు రావని పండితులు చెబుతున్నారు. మరి ఆ వస్తువులు ఏంటి అనే విషయానికి వస్తే…

తరచు మనం పీడకలలతో బాధపడుతూ ఉంటే మన దిండు కింద నెమలీకను పెట్టుకోవడం వల్ల మనసు ఎంతో ఆహ్లాదకరంగా ఉండటమే కాకుండా మనపై ఒత్తిడిని తగ్గించి ప్రశాంతకరమైన నిద్ర కలగడానికి దోహదపడుతుంది.అదేవిధంగా పీడకలలతో బాధపడేవారు దిండు కింద హనుమాన్ చాలీసా పెట్టుకోవడం కూడా ఎంతో మంచిది. ఇక వీటితోపాటు చిన్నటి ఇనుపకత్తిని దిండు కింద పెట్టుకోవాలి అదే విధంగా రుద్రాక్షను కూడా దిండు కింద పెట్టుకొని పడుకోవడం వల్ల ఎలాంటి పీడకలలు దరికి చేరకుండా ఉండడమే కాకుండా ప్రశాంతకరమైన నిద్రను కూడా కలిగిస్తాయని పండితులు చెబుతున్నారు.