Actress: తెలుగు సినిమా చరిత్రలో అమరనటిగా నిలిచిపోయిన మహానటి సావిత్రి (Mahanati Savitri) గురించి చెప్పుకునే ప్రతీ మాట గర్వించదగినదే. ఆమె ప్రతిభతో తెలుగు ప్రేక్షకులకు అందించిన అనుభూతి మరెవ్వరూ అందించలేకపోయారు. అలాంటి సావిత్రి వ్యక్తిగత జీవితంలోని కొన్ని అసాధారణ విషయాలను అప్పట్లో ఆమె ఇంట్లో కేర్ టేకర్‌గా ఉన్న చెన్న కేదారేశ్వరరావు వివరించారు. సావిత్రిగారి ఇంట్లో స్విమ్మింగ్ పూల్ శుభ్రం చేసే బాధ్యతతో మొదలైంది నా పని. రోజుకి ఒక గంట పని చేసి నెలకు 60 రూపాయలు తీసుకునేవాడినని సీజప్పాడు.
ఓ రోజున సావిత్రి (Mahanati Savitri)గారి కుమారుడు సతీష్ బాబు స్విమ్మింగ్ పూల్‌లో ప్రమాదానికి గురైతే నేను వెంటనే రక్షించాను. ఆ ఘటన తరువాత సతీష్ బాబును చూసుకునే బాధ్యత నాకు అప్పగించారు. అలాగే, జీతం కూడా పెరిగింది. అప్పుడు ఆ ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు, ఒక ఇల్లు ఇంత అద్భుతంగా ఉంటుందా అని ఆశ్చర్యపోయాను” అని ఆయన చెప్పుకొచ్చారు.
సావిత్రి (Mahanati Savitri) గారి బంగ్లా విశాలమైనదే కాదు, ఎంతో సొగసైనదిగా ఉండేదని కేదారేశ్వరరావు గుర్తు చేసుకున్నారు. పెద్ద స్విమ్మింగ్ పూల్, సుందరమైన గార్డెన్, వేరు వేరు 7 కార్లు పార్క్ చేయడానికి ప్రత్యేక స్థలాలు ఉండేవి. ఈ బంగ్లాకు రెండు గేట్లు ఉండేవి, ఒక గేటు ద్వారా కార్లు లోపలికి వచ్చి మరొక గేటు ద్వారా బయటికి వెళ్లేవి. అలాంటి సావిత్రి (Mahanati Savitri) గారి భవంతి లక్ష రూపాయలకే అమ్మారనగానే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుందన్నారు.
ఆ అమ్మకానికి కారణం “ప్రాప్తం” సినిమా. ఆ సమయంలో డబ్బు అత్యవసరం కావడంతో సావిత్రి గారు తన ఆస్తి అమ్మకానికి సిద్ధమయ్యారని చెప్పారు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం ఆమె జీవితానికి కీలక మలుపు తీసుకువచ్చింది. ఆ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయి, ఆమెకు ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. సావిత్రి చెన్నైలోని అన్నా నగర్ లో కట్టుకున్న తనకు ఇష్టమైన ఆ ఇల్లు స్థలం కలిపి ఇప్పుడు దాదాపు 100 కోట్ల ఖరీదైనది. ఆమె గనక ఆస్తులు కాపాడుకొని ఉండి ఉంటే వాటి విలువ ఇప్పుడు శోభన్ బాబు ఆస్తి కంటే ఎక్కువగా ఉండేదని అలనాటి సావిత్రి సన్నిహితులు చెబుతుంటారు.