Sayani Gupta: డైరెక్టర్ చెప్పిన వినకుండా ముద్దులు పెడుతూనే ఉన్నాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన నటి!

Sayani Gupta: నటి సయాని గుప్త గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఈమె చాలా సినిమాలలో నటించి మెప్పించింది. ఎక్కువ శాతం రొమాంటిక్ సన్నివేశలలో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఎక్కువ శాతం బోల్డ్ సన్నివేశాలలో నటించి ఈమె బోల్డ్ బ్యూటీగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకి సరైన గుర్తింపు లభించలేదు. ఇకపోతే ఆమె చేసిన ఫోర్ మోర్ షాట్స్ లాంటి వెబ్ సిరీస్ లో ఆమె ఎంతగా రెచ్చిపోయి నటించిందో మనందరికి తెలిసిందే.

ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఇంటర్వ్యూలో చేసిన వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. శృంగారం గురించి నేను ఒక బుక్ రాయగలను. సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ చెయ్యడం చాలా సులువు. కానీ ఒకసారి మాత్రం నాకు చేదు అనుభవం ఎదురైంది. ఒక సినిమా షూటింగ్ లో బోల్డ్ సీన్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ కట్ చెప్పినా కూడా అందులోని హీరో ఆగలేదు. అలాగే ముద్దులు పెట్టాడు అని ఆమె తెలిపింది. అంతేకాకుండా సదరు నటుడి ప్రవర్తన తనకు ఏ మాత్రం నచ్చలేదని, చాలామంది ఆ విషయాన్ని చిన్న విషయంగా భావిస్తారు కానీ అలా చేయడం కరెక్ట్ కాదు అని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.

కొందరు నటీనటుల సేఫ్టీ గురించి అస్సలు పట్టించుకోరంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఆ సినిమా ఏది ఆ హీరో ఎవరు అన్న విషయాలను మాత్రం ఆమె వెల్లడించలేదు. ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆ హీరో ఎవరు? హాయ్ సినిమా ఏది అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఆమె చేసిన వాఖ్యలు బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి.