ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులందరూ జపిస్తున్న నామం ఒకటే అదే పుష్ప 2. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. అందులో భాగంగానే సినిమా ప్రమోషన్స్ బాగా జోరందుకుంది ఇప్పటివరకు పాట్నా, చెన్నైలో ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహించిన ఈ మూవీ టీం తాజాగా కేరళలోని కొచ్చిలో కూడా ప్రమోషనల్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. కేరళ వాసులు అల్లు అర్జున్ టీం కి ఘన స్వాగతం పలికారు.
అయితే ప్రతి ఈవెంట్లో అల్లు అర్జున్, రష్మిక మందన్న పాల్గొంటున్నారు కానీ ప్రముఖ పాత్ర పోషించిన ఫాహద్ ఫాజిల్ మాత్రం ఏ ప్రమోషన్స్ లోని పాల్గొనలేదు. ఇదే విషయంగా అల్లు అర్జున్ స్టేజ్ మీద మాట్లాడుతూ ఫాహద్ ఫాజిల్ ని ఒక రేంజ్ లో పొగిడేసాడు, ఈ సినిమాలో నటించినందుకు అతనికి థాంక్స్ చెప్పాడు, ఈ సినిమాలో ఫాహద్ ఫాజిల్ యాక్టింగ్ అద్భుతంగా ఉంటుంది తన నటనతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క మలయాళీ ఆడియన్ గర్వపడేలా చేస్తాడని చెప్పుకొచ్చాడు.
నేను ఇప్పటివరకు చాలా సినిమాలు చేసినా మొదటిసారి ఒక ఉత్తమ మలయాళీ నటుడితో చేశాను. నిజానికి ఈరోజు ఆయన కూడా ఈ ఈవెంట్లో ఉంటే బాగుండేది. లేకపోవటం చాలా బాధగా ఉంది మేమిద్దరం కలిసి కేరళలో స్టేజి షేర్ చేసుకుని దాన్ని ఐకానిక్ మూమెంట్గా మార్చాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్. మలయాళీ ఆడియన్స్ ని ఉద్దేశించి నా సినిమా కోసం మీరు మూడేళ్లుగా వెయిట్ చేస్తున్నారని తెలుసు తప్పకుండా ఇకనుంచి తొందరగా సినిమాలు చేస్తానని మాట ఇచ్చాడు అల్లు అర్జున్.
సుకుమార్ దర్శకత్వం వహించిన ఆర్య చిత్రంతోనే నా మార్కెట్ కేరళలో స్టార్ట్ అయింది. దర్శకుడు సుకుమార్ వల్లే నేను మీకు దగ్గరయ్యాను. నా చిత్రానికి పనిచేసిన మలయాళీ రైటర్స్ అందరికీ కూడా చాలా థాంక్స్. మైత్రి నవీన్, రవి, చెర్రీల సపోర్టు వల్ల ఈ సినిమా సాధ్యమైంది. మలయాళీ ఫ్యాన్స్ ఆర్మీ అనే పదాన్ని స్టార్ట్ చేశారు అంటూ మలయాళీ ని ఒక రేంజ్ లో పొగిడేసారు బన్నీ. కేరళలో బన్నీకి ఉన్న మార్కెట్ దృష్ట్యా అక్కడ కూడా మంచి కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మూవీ టీం.