ప్రముఖ టెలీకాం కంపెనీలలో ఒకటైన బీఎస్ఎన్ఎల్ జియో, ఎయిర్‌టెల్, వీఐ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది. బీఎస్ఎన్ఎల్ ను వినియోగించే కస్టమర్ల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. ప్రతి నెలా లక్షల్లో ఈ సంస్థ కస్టమర్ల సంఖ్య పెరగడం హాట్ టాపిక్ అవుతోంది. బీఎస్‌ఎన్‌ఎల్ ఒకదాని తర్వాత ఒకటి కొత్త ప్లాన్‌లను ప్లాన్ లను ప్రకటిస్తూ ఉండటం గమనార్హం.
201 రూపాయలకే దాదాపు మూడు నెలల వాలిడిటీని ఈ సంస్థ అందిస్తోంది. ఇంటర్నెట్ లేకుండా ఫోన్ వాడాలని భావించే వాళ్లకు బీఎస్ఎన్ఎల్ బెస్ట్ అవుతుందని చెప్పవచ్చు. ఈ ప్లాన్ ద్వారా 300 నిమిషాల సమయం ఇస్తారు. ఏ నెట్‌వర్క్‌కైనా ఈ ఉచిత కాలింగ్ నిమిషాలను వినియోగించుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా మొత్తం 6జీబీ డేటా పొందే అవకాశాలు అయితే ఉంటాయి.
ఈ ప్లాన్ లో 6జీబీ డేటా లభించనుండగా పరిమితంగా 99 ఉచిత మెసేజ్ లను సైతం పంపే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ప్రైవేటు సంస్థల రీఛార్జ్ ధరలతో పోలిస్తే ఈ రేట్లు చాలా తక్కువగా ఉండటంతో ఎక్కువమంది బీఎస్ఎన్ఎల్ యూజర్లుగా మారుతున్నాయి. ఎక్కువ మొత్తంలో డేటా, కాల్స్ మాట్లాడే వాళ్లు మాత్రం 499 ప్లాన్ ను రీఛార్జ్ చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.
ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 3 నెలలే కావడం గమనార్హం. ఈ ప్లాన్ ద్వారా అన్ లిమిటెడ్ కాల్స్ చేసే అవకాశం ఉండటంతో పాటు డేటా, 300 మెసేజెస్ లభిస్తాయి. ఎక్కువ డేటా కావాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అవుతుందని చెప్పవచ్చు.