తాను సింగిల్ అంటున్న మల్లికా షెరావత్.. దానికి వ్యతిరేకం కాదంటున్న హాట్ బ్యూటీ!

బాలీవుడ్ లో శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న నటి మల్లికా షెరావత్ ఘాటైన రొమాంటిక్ సన్నివేశాలు, అందాల ఆరబోతతో కుర్రకారు హృదయాల్లో అలజడి సృష్టించేది ఈ భామ. మర్డర్ సినిమాతో పాపులర్ అయిన మల్లిక కుర్రాళ్ళ కలల శృంగార దేవతగా మారిపోయింది. చాలా చిత్రాలు మల్లిక గ్లామర్ షో తోనే కాసుల పంట పండించిన సందర్భాలు ఉన్నాయి.

బాలీవుడ్ బ్యూటీలలో అందరికన్నా సెక్సీ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఈ నటి బాలీవుడ్ లోనే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరు కావడం విశేషం. ఇటీవల బాలీవుడ్ లో ఆమె సినిమాల జోరు తగ్గిందనే చెప్పుకోవచ్చు. రాను రాను సిల్వర్ స్క్రీన్ కి దూరం అవుతూ వచ్చిన ఈ భామ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలని అప్లోడ్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తుంది.

తాజాగా ఈ హాట్ బ్యూటీ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని త‌న ఫ్రెంచ్‌ ప్రియుడు సిరిల్ ఆక్సెన్‌ఫాన్స్‌తో తనకి బ్రేకప్ అయిందని, ప్రస్తుతం తాను సింగల్ గా ఉంటున్నానని చెప్పుకొచ్చింది. మేమిద్దరం చాలా కాలం కలిసి ఉన్నాము కానీ ఇప్పుడు కాదు. ఈ రోజుల్లో సరియైన వ్యక్తిని కనుగొనటం చాలా కష్టం ప్రస్తుతం నేను సింగల్ గానే ఉన్నాను. ప్రస్తుతానికి పెళ్లిపై ఆసక్తి లేదు అలాగని నేను పెళ్ళికి వ్యతిరేకం కాదు భవిష్యత్తులో అది నాకు ఎదురయ్యే వ్యక్తిని బట్టి ఆధారపడి ఉంటుందని చెప్పింది.

ఇంత చెప్పినా ఈ భామ తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ కి గల కారణాలు మాత్రం చెప్పలేదు. ఈ భామ ఒకసారి కపిల్ శర్మ షోలో పాల్గొన్నప్పుడు తన అందాన్ని చాలామంది వికృతంగా ఉపయోగించుకోవాలి అనుకున్నారు అంటూ బాలీవుడ్లో తనకు ఎదురైనా ఒక చేదు అనుభవాన్ని గురించి వివరించింది. గతంలో ఒక దర్శకుడు నా నడుము, బొడ్డు ని హైలెట్ చేయాలనుకుంటే అందుకు నేను ఓకే చెప్పాను కానీ వారు నా నడుముని వికృతంగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు అలాంటి సన్నివేశాలకు ఒప్పుకునేదే లేదని చెప్పేశానని చెప్పింది ఈ హాట్ బ్యూటీ.