ఈ సంవత్సరం చాలా స్పెషల్.. అఖిల్ పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన నాగార్జున..

యువ హీరో అఖిల్ అక్కినేని త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. ఆయన నిశ్చితార్థం జైనబ్ రవ్జీ అనే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ తో చాలా సింపుల్ గా, చాలా సైలెంట్ గా జరిగిపోయింది. నాగార్జున సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసి విషయం చెప్పే వరకు ఎవరికి తెలియదు. డిసెంబర్ 4న తన పెద్ద కుమారుడు నాగచైతన్య వివాహం, రెండవ కుమారుడు నిశ్చితార్థం పట్ల చాలా ఆనందంగా ఉన్నానని చెప్పకొచ్చిన నాగార్జున ఈ సంవత్సరం మాకు చాలా స్పెషల్.

నాన్నగారి శత దినోత్సవ వేడుకలు ఈ సంవత్సరమే, అలాగే నా కుమారులు ఇద్దరు తమ జీవితాల్లో కొత్త అధ్యాయాలను ఈ సంవత్సరమే ప్రారంభించబోతున్నారు అని చెప్పారు. అలాగే అఖిల్ ఎంగేజ్మెంట్ పట్ల చాలా సంతోషంగా ఉన్నానని జైనాబ్ అందమైన అమ్మాయి మాత్రమే కాదు అఖిల్ కి సరి అయిన జోడి వారిద్దరూ తమ జీవితాలను కొనసాగించాలని నిర్ణయించుకున్నందుకు ఆనందంగా ఉంది. ఆమెని సాదరంగా మా ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాం అని చెప్పిన నాగార్జున వాళ్ళ పెళ్లి మాత్రం 2025 లోనే జరుగుతుందని చెప్పుకొచ్చారు.

ఇక ఎవరు ఈ జైనాబ్ అని సెర్చ్ చేసిన నెటిజన్స్ కి ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలిసి షాక్ అయ్యారు. ఈమె ఒక చిత్రకారిణి,,సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి పేరుంది. మనదేశంలోనే కాక దుబాయ్, లండన్ లో కూడా ఈమె ప్రదర్శనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాదులో పుట్టి ముంబైలో స్థిరపడినట్లు సమాచారం. ఈమెకి అఖిల్ తో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత అది ప్రేమగా మారిందని తెలుస్తోంది.

ఇక డిసెంబర్ 4వ తారీఖున జరిగే చైతన్య పెళ్లి గురించి మాట్లాడిన నాగార్జున చైతన్య పెళ్లి మా నాన్నగారు స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోలో జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా కుటుంబం చాలా పెద్దది అలాగే శోభిత కుటుంబం కూడా చాలా పెద్దది. అందుకే కుటుంబ సభ్యులు, కొంతమంది సన్నిహితుల మధ్య ఈ పెళ్లి జరుగుతుంది అని చెప్పారు నాగార్జున.