నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన బార్క్.. భారీ వేతనంతో ఉద్యోగ ఖాళీలు!

బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు చెప్పింది. 4374 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. టెక్నికల్ ఆఫీసర్/సీ, సైంటిఫిక్ అసిస్టెంట్/బీ, టెక్నీషియన్/బీ, మరియు స్టైఫండరీ ట్రైనీ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

మే నెల 22వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉండటంతో ఈ ఉద్యోగ ఖాళీలకు ఒకింత పోటీ ఎక్కువగానే ఉండనుందని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 212 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా ట్రైనింగ్ స్కీమ్ ద్వారా ఇతర ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది.

barc.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశంతో పాటు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ వెబ్ సైట్ లో కెరీర్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి అందులో రిక్రూట్మెంట్ ఆప్షన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ను నింపిన తర్వాత అప్లికేషన్ ఫీజును చెలించి ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకుని భద్రపరచుకుంటే సులువుగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు వేతనం కూడా ఎక్కువగానే ఉండనుంది. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. వరుసగా భారీ జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పవచ్చు.