Actress: మామూలుగా సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీలకు సంబంధించిన ప్రేమ పెళ్లి వ్యవహారాలకు సంబంధించి తరచుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్న వారు కూడా ఉన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత ఊహించని విధంగా విడాకులు తీసుకొని విడిపోవడం ఇలాంటివన్నీ ఇండస్ట్రీలో సహజం అని చెప్పాలి. అలా విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ పెళ్లి చేసుకొని మూడుముళ్ల బంధంతో ఒకటి అవుతూ ఉంటారు.
చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసుకుని కుటుంబ బాధ్యతలతో సతమతం అయిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే 47 ఏళ్ల బుల్లితెర నటి కూడా ఒకరు. ప్రస్తుతం ఆమె పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. ఇద్దరు పిల్లల తల్లి, రెండు పెళ్లిళ్లు రెండుసార్లు విడాకులు, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా, ఆమె మరెవరో కాదు ప్రముఖ బుల్లితెర నటి దీప్సిఖా నాగ్ పాల్. ఆమె తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలిచారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ.. నేను చాలా కాలంగా ఒంటరిగా ఉంటున్నాను. ఇప్పుడు మళ్లీ పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాకపోతే కొన్ని షరతులు ఉన్నాయి అని ఆమె చెప్పుకొచ్చింది. ఆ షరతులు ఏంటి అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. కాగా దీప్సిఖా మొదట 1997లో నటుడు ఉపేంద్రను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కొన్నాళ్లకే వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె 2012లో కేశర్ అరోరాను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి బంధం సైతం ఎక్కువ కాలం సాగలేదు. 2016లో ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు..విడిపోయారు. ప్రస్తుతం తన పిల్లలతో కలిసి నివసిస్తోంది దీప్సిఖా నాగ్ పాల్. ఇప్పుడు మూడో పెళ్లి చేసుకోవడానికి తన సిద్ధంగా ఉన్నట్లు ఆమె చెప్పుకొచ్చింది.
