హిందూ సంప్రదాయాల ప్రకారం జరుపుకునే పండుగలలో హోలీ పండుగ ఒకటి హోలీ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఇలా హోలీ పండుగ రోజు హోలిక దహనాన్ని నిర్వహించి ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఇలా ఎంతో నియమనిష్టలతో జరుపుకొని ఈ పండుగ రోజు కనుక ఇంట్లో ఈ వస్తువుల కనక ఉంటే అష్ట దరిద్రాలు మీ ఇంట్లోనే తాండవం చేస్తుంటాయి అందుకే హోలీ పండుగ రోజు కనుక ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే ముందు రోజే ఆ వస్తువులను తీసి పడేయడం ఎంతో మంచిది.
హోలీ పండుగకు ముందు రోజు మీ ఇంట్లో కనుక పాత చీపురులు కనుక ఉంటే అష్ట దరిద్రం కలుగుతుంది అందుకే ఇలాంటి చీపురులు కనుక మీ ఇంట్లో ఉంటే వెంటనే ఒక గోత్ తీసి పాతిపెట్టి హోలీ పండుగ రోజు కొత్త చీపురును ఇంట్లోకి తీసుకురావడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి ఆమె అనుగ్రహం మనపై కురిపిస్తుంది.ఇక మీ ఇంట్లో మీరు ఉపయోగించిన దుస్తులు పాత దుస్తులు ఉన్నప్పటికీ వాటిని ఇతరులకు దానం చేయడం ఎంతో మంచిది.
ఇంటి ఆవరణంలో లక్ష్మీ స్వరూపంగా ఉన్నటువంటి తులసి మొక్క కనుక ఎండిపోయి లేదా వాడిపోయి ఉంటే వెంటనే దానిని హోలీ పండుగకు ముందు రోజు తొలగించి కొత్త మొక్కను నాటడం వల్ల అమ్మ వారి కృప మీపై ఉంటుంది. ఇక చాలా మంది తెగిపోయిన చెప్పులను కూడా ఇంట్లోనే పెట్టుకొని ఉంటారు ఇలా తెగిపోయిన చెప్పులు ఉండడం పరమ దరిద్రం ఇలాంటివి కనుక ఉంటే వెంటనే వాటిని ఖాళీ చేయడం వల్ల ఎలాంటి అశుభం జరగకుండా అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి.