Thamanna -Vijay Varma: సినీ నటి తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో పడిన విషయాన్ని ఆమె అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే .వీరిద్దరూ కలిసి లస్ట్ స్టోరీస్ 2 లో నటించారు. అప్పటినుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు తెలియజేశారు. ఇలా వీరి ప్రేమ విషయాన్ని తెలియజేసినప్పటి నుంచి వీళ్లిద్దరు బహిరంగంగా బయట కనిపించడం మొదలుపెట్టారు. జంటగా వెకేషన్ లకి వెళ్లడం పార్టీలకు వెళ్లడం వంటివి జరిగేది.
ఇటీవల కాలంలో వీరిద్దరూ జంటగా కనిపించకపోవడంతో తమన్న విజయవర్మ ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారా అంటూ సందేహాలు వ్యక్తమయ్యాయి ఈ వార్తలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ చేశాయి. వీరిద్దరి మధ్య కెరియర్ పరంగా కొన్ని భేదాభిప్రాయాలు రావటంతో బ్రేకప్ చెప్పుకొని విడిపోయారని అందుకే తమన్న తన సోషల్ మీడియా ఖాతాలో కూడా విజయవర్మకు సంబంధించిన ఫోటోలు అన్నిటినీ డిలీట్ చేశారు అంటూ వార్తలు హల్చల్ చేశాయి.
ఇలా వీరిద్దరి బ్రేకప్ గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నప్పటికీ తమన్న అలాగే విజయ్ వర్మ ఇద్దరూ కూడా స్పందించలేదు దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే తాజాగా హోలీ పండుగ సందర్భంగా తమ బ్రేకప్ గురించి వస్తున్న వార్తలకు పూర్తిగా చెక్ పెట్టారు. హోలీ పండుగ సందర్భంగా వీరిద్దరూ కలిసి ఎంతో సంతోషంగా హోలీ జరుపుకున్నారని తెలుస్తోంది ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలను కూడా తమన్న సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇలా వీరిద్దరూ కలిసి హోలీ పండుగను ఎంతో ఘనంగా జరుపుకోవడంతో వీరి బ్రేకప్ గురించి వచ్చిన వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని స్పష్టం అవుతుంది.