అంజీర వాటర్ తాగడం వల్ల కలిగే అద్భుతమైన లాభాలివే.. ఆ సమస్యలన్నీ దూరమవుతాయా?

మనలో చాలామంది అంజీర వాటర్ ను ఎంతో ఇష్టంగా తాగుతారనే సంగతి తెలిసిందే. ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో అంజీర నీళ్లు తోడ్పడతాయని చెప్పవచ్చు. ఆయుర్వేదంలో సైతం అంజీరకు ఊహించని స్థాయిలో ప్రాధాన్యత ఉంటుంది. అంజీరను నీళ్లలో నానబెట్టి ఆ నీటిని తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు సులువుగా దూరమవుతాయని చెప్పవచ్చు.

ఎముకలను బలాన్ని ఇచ్చే విషయంలో అంజీర నీళ్లు సహాయపడతాయి. జాయింట్లను పటిష్టం చేసే విషయంలో అంజీర తోడ్పడుతుంది. అంజీర నీళ్లు తాగడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. ఇందులో ఉండే పొటాషియం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని కచ్చితంగా చెప్పవచ్చు. మలబద్ధకం సమస్యతో బాధ పడేవాళ్లు అంజీర నీళ్లు తాగడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు.

ఊపిరితిత్తుల సమస్యలను తగ్గించడంతో పాటు పేగులలో ఇన్ ఫ్లమేషన్ ను తగ్గించడంలో అంజీర తోడ్పడుతుంది. బరువు తగ్గాలని భావించే వాళ్లు అంజీర, అంజీర నీళ్లను తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అంజీర నీళ్ల్ తాగడం వల్ల ఆరోగ్యానికి లాభమే తప్ప నష్టం ఉండదు. అయితే అంజీర పండ్లను మరీ ఎక్కువగా తీసుకోవడం మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు.

ఎండిన అంజీర్ ముక్కల్ని 2 నుంచి 4 తీసుకొని ఓ గిన్నెలో సగం వరకు నీరు పోసి అంజీర్ ముక్కల్ని అందులో వేసి రాత్రంతా నానబెడితే మంచిది. చాక్లెట్స్, ఐస్‌క్రీమ్ తినడానికి బదులు భోజనం తర్వాత స్వీట్స్‌కి ప్రత్యామ్నాయంగా వీటిని తీసుకోవచ్చు. అంజీర్‌లో జింక్, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు అధికంగా ఉండటం వల్ల పునరుత్పత్తి సమస్యలు దూరమవుతాయని చెప్పవచ్చు.