Home News Today Horoscope : జనవరి 23rd శనివారం మీ రాశి ఫ‌లాలు

Today Horoscope : జనవరి 23rd శనివారం మీ రాశి ఫ‌లాలు

మేషరాశి: విజయం పొందుతారు !

ఈరోజు మీకు ముఖ్య విషయాలు తెలుస్తాయి. గ్రహచలనం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా మీ బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు బాగుంటాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. మీ లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు మరింత ఉత్సాహంగా ఉంటారు. పనిప్రదేశంలో ఇబ్బందులు పడకుండా ఉండాలి. ధన, వస్తులాభాలు. సాయంత్రం మెరుగ్గా ఉంటుంది. మీరు వ్యాపార ప్రయోజనాలను, ప్రణాళికలో విజయం పొందుతారు. అనుకూలంగా ఉండటానికి శ్రీవిష్ణు ఆరాధన చేయండి.

వృషభరాశి: బంధువులతో విభేదాలు !

ఈరోజు ఆటంకాలు, ఏదైనా విషయం గురించి గందరగోళం చెందుతారు. మిత్రులు, బంధువులతో విభేదాలు. కాబట్టి పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. మీ తెలివితేటలతో ప్రత్యర్థులను ఓడిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. గృహానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యవహారాలలో అవాంతరాలు. ఈ రోజు కూడా మీ డబ్బును శుభకార్యాల కోసం ఖర్చు చేస్తారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. విద్యార్థుల పరిస్థితి మెరుగుపడుతుంది. శుభఫలితాల కోసం శ్రీగురు గ్రహారాధన చేయండి.

మిథునరాశి: ఆప్తుల నుంచి శుభవార్తలు !

ఈరోజు గ్రహచలనాల రీత్యా కొన్ని సమస్యలు తీరతాయి. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత కొత్త కార్యానికి ప్రయత్నిస్తారు. సామాజిక, ధార్మిక పనులకు సహకరించవచ్చు. ఆప్తుల నుంచి శుభవార్తలు. మీ తెలివితేటలు, అనుభవంతో విజయాలు సాధిస్తారు. ఆఫీస్‌లో కొత్త పథకాలు అమలు చేయవచ్చు. ముఖ్య విషయాలలో చర్చలు. ఆర్థిక విషయాల్లో నిర్ణయం. కుటుంబ జీవితంలో తీపి, చేదు అనుభవాలు ఉంటాయి. విద్యార్థులు చదివేందుకు ఆసక్తి చూపుతారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

కర్కాటకరాశి: భాగస్వామి నుంచి మీకు మద్దతు లభిస్తుంది !

ఈరాశివారికి గ్రహచలనాల రీత్యా చేసే పనులు, వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. అంతేకాకుండా ఈ రోజు మీ భాగస్వామి నుంచి మీకు మద్దతు లభిస్తుంది. కుటుంబంలో వివాదాలు సర్దుకుంటాయి. వ్యాపారంలో భాగస్వాముల నుంచి మీరు సహకారాన్ని ఆశించవచ్చు. ఉద్యోగం చేసే జాతకులకు పురోగతి ఉంటుంది. మనశ్శాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం. అధిక శ్రమ. ఈ రోజు మీకు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇష్టదేవతరాధన చేయండి దీనివల్ల మంచి జరుగుతుంది.

సింహరాశి: ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి !

ఈరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. కుటుంబ పరిస్థితులు అనుకూలించవు.. కొనసాగుతున్న పనుల్లో జాగ్రత్తలు తీసుకోండి. ఆఫీస్‌లో పదోన్నతికి అవకాశాలు ఉన్నాయి. వ్యవహారాలలో ఇబ్బందులు. పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ మీ నిబద్ధతతో ముందుకు వెళ్తారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. మంచి ఫలితాల కోసం శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

Today January 23Rd 21 Daily Horoscope In Telugu

కన్యరాశి: ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోండి !

ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోండి. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారంలో పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. షేర్లలో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు. ఆఫీస్‌లో అందరితీ సమన్వయంతో ఉండల్సిన సమయం. ప్రభుత్వ రంగానికి సంబంధించి పని చేయవచ్చు. దేవాలయ దర్శనాలు. కుటుంబ బాధ్యతల నుంచి కొన్ని సమస్యలు ఎదురుకుంటారు. అనుకూల ఫలితాల కోసం శ్రీలక్ష్మీ, కుబేర ఆరాధన చేయండి.

తులరాశి:  కొత్త పనులు ప్రారంభిస్తారు !

ఈరోజు అనుకూలంగాఉంటుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. వ్యాపార ప్రయత్నాలు విజయవంతమవుతాయి. లాభాలు వస్తాయి. ఈరోజు మీకు ఆనందం కలిగే సంఘటనలు జరుగుతాయి. కుటుంబం నుంచి సహకారం, ఆహ్వానాలు అందుతాయి. ప్రభుత్వంతో పనిచేసేవారికి అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో అవాంతరాలు అధిగమిస్తారు. ఎందుకంటే కోల్పోయే ప్రమాదముంది. ఇష్టదేవతరాధన చేయండి.

వృశ్చికరాశి: సహోద్యోగుల నుంచి మద్ధతు లభిస్తుంది !

ఈరోజు అనుకూల ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. వివాదాల నుంచి గట్టెక్కుతారు. అంతేకాకుండా పనిప్రదేశంలో మీ ప్రభావం, ప్రాముఖ్యత పెరుగుతుంది. పాతబాకీలు వసూలవుతాయి. అధికారులు, సహోద్యోగుల నుంచి మద్ధతు లభిస్తుంది. వ్యవహారాలలో విజయం. కుటుంబ జీవితంలో ఈ రోజు మీకు ఆనందం ఉంటుంది. వ్యాపారాలు లాభాలదిశగా సాగుతాయి. సాయంత్రం సమయంలో శుభకరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. నవగ్రహస్తోత్రం పారాయణం చేయండి.

ధనస్సురాశి: శ్రమ పడినా ఫలితం ఉండదు !

ఈరోజు అంతగా బాగుండదు. కొన్ని విషయాలు బాగుంటాయి. మీరు చేసే ఆలోచనలు కలసిరావు. మీరు ఉత్సాహంగా ఉంటారు. శ్రమ పడినా ఫలితం ఉండదు. ఈ రోజు మీరు షాపింగ్ చేసే అవకాశముంది. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. పనిప్రదేశంలో సహనం వల్ల ప్రయోజనం పొందుతారు. పనుల్లో ప్రతిబంధకాలు. దగ్గరగా ఉన్నవారికి సహాయం చేయడంలో మీకు ఇబ్బంది ఉండవచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. రాత్రి సమయంలో కుటుంబం, స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతారు. ఇష్టదేవతరాధన చేయండి.

మకరరాశి: కుటుంబ సభ్యులకు అనారోగ్య సూచన !

ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. కొన్ని వ్యవహారాలు వాయిదా పడతాయి. కొత్త ఒప్పందం వల్ల అనుకోని ధనలాభం అందుకుంటారు. కుటుంబ సభ్యులకు అనారోగ్య సూచన. ఇంటాబయటా ఒత్తిడులు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో కలసి ఏదైనా ప్రత్యేక పథకంలో భాగం కాకండి. ప్రమాదకర పనులకు దూరంగా ఉండండి. శ్రీరామజయరామ నామాన్ని కనీసం 108 సార్లు జపించండి.

కుంభరాశి: ఆర్థికంగా లాభాలు అందుకుంటారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. చేసే యత్నకార్యసిద్ధి. పెండింగ్ పనులు పూర్తిచేయడం వల్ల ఆనందంగా ఉంటుంది. కొత్తగా వస్తులాభాలు. ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. గత కొన్నిరోజులుగా కుటుంబంలో ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నవారికి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత పరిష్కరించుకునే అవకాశముంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. మీకు కొన్ని ఆసక్తికరమైన పనులు చేయడానికి అవకాశం లభిస్తుంది. శ్రీరామ రక్ష స్తోత్రం పారాయణం చేయండి.

మీనరాశి: ఆఫీస్‌లో పురోగతి సాధిస్తారు !

ఈరోజు మిశ్రమ ఫలితాలు బాగుంటాయి. కుటుంబ సభ్యులతో కలహాలు. మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆఫీస్‌లో పురోగతి సాధిస్తారు. అందరి నుంచి అవసరమైన సహకారం లభిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. మీ ప్రతిష్ట, ప్రభావాన్ని పెంచడానికి ఈ రోజు మంచిది. మీరు పిల్లల నుంచి ఆనందం పొందుతారు. పనికోసం చూస్తున్న ప్రజలు ఈ రోజు ఆసక్తి కనబరుస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి ఉంటుంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. స్వల్ప అనారోగ్యం. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

- Advertisement -

Related Posts

అమెరికా ఇండియాకి ఎన్ని లక్షల కోట్లు బాకీ ఉందంటే ?

అమెరికా అంటే ప్రపంచ పెద్దన్న. ప్రపంచంలోని చాలా దేశాలకు అప్పులిస్తుంది. అయితే, ఆ దేశం కూడా అప్పులు చేస్తుంది. అంతా ఇంతా కాదు. భారీ ఎత్తున అప్పులు చేస్తోంది. అభివృద్ది చెందిన దేశంగా...

మూడో కూటమిగా కమల్‌హాసన్-శరత్‌ కుమార్… రంజుగా మారుతున్న తమిళ రాజకీయం!

చెన్నై: డీఎంకే కూటమి నుంచి నటుడు శరత్‌ కుమార్‌ బయటకు వచ్చి కమల్‌హాసన్ స్థాపించిన మక్కల్‌ నీది మయ్యం పార్టీతో కలిసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తమిళనాడు రాజకీయాలలో రోజురోజుకు వేడి...

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు … మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానంలో బరిలో 93 మంది !

తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు ఫైనల్ అయ్యారు. నామినేషన్ల పరిశీలనలో కొంతమంది నామినేషన్లు రిజక్ట్ కాగా , నామినేషన్ల ఉపసంహరణలో కొంతమంది విత్ డ్రా చేసుకున్నారు. మహబూబ్‌నగర్-...

పబ్లిసిటీ పీక్… మ్యాటర్ వీక్ అంటూ జగన్ మీద లోకేష్ సెటైర్లు

ఆంధ్ర ప్రదేశ్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్ చేస్తూ హై కోర్ట్ ఉత్తర్వులివ్వటంతో రాజకీయ పార్టీలన్నీ వ్యూహ రచనలో మునిగిపోయాయి. మున్సిపల్ ఎన్నికలు అంటే దాదాపు పట్టణ జనాభా అధికంగా ఉండేవే...

Latest News