వాస్తు ప్రకారం ఈ మొక్క ఇంట్లో ఉంటే చాలు.. ఇక మీ ఇంటికి డబ్బు ధన ప్రవాహమే!

వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల వస్తువులు మొక్కలు మన ఇంట్లో ఉండటం వల్ల లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు మనపై ఉంటాయని భావిస్తారు. ఈ క్రమంలోనే మన ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం కోసం మనీ ప్లాంట్ ను ఎంతో శుభసంకేతంగా భావిస్తాము అయితే మనీ ప్లాంట్ కన్నా మన ఇంట్లో త్రాసుల ప్లాంట్ కనుక ఉంటే మన ఇంటికి డబ్బు ప్రవాహమే అని వాస్తు శాస్త్రం చెబుతోంది.వాస్తు శాస్త్రం ప్రకారం ఏ ఇంట్లో అయితే త్రాసుల మొక్క ఉంటుందో ఆ ఇంట్లో ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవని వాస్తు శాస్త్రం చెబుతోంది.

చాలామంది ఇంట్లో ఎంతో కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నప్పటికీ చేతిలో చిల్లి గవ్వ కూడా నిలబడదు ఇలా డబ్బులతో ఇబ్బంది పడుతున్న వారి ఇంటిలో వాస్తు దోషం ఉంటుందని ఇలాంటి వాస్తు దోషపుతో బాధపడేవారు ఈ త్రాసుల ప్లాంట్ నాటడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని చెప్పవచ్చు.ఈ త్రాసులో ప్లాంట్ ను మన ఇంట్లో మాత్రమే కాకుండా మనం వ్యాపారాలు చేసే చోట లేదా ఆఫీసులలో కూడా పెంచవచ్చు.

వాస్తు శాస్త్రం ప్రకారం ఈ త్రాసుల ప్లాంట్ మన ఇంటి ప్రధాన ద్వారం కుడివైపు మాత్రమే నాటాలి. ఇలా ఇంటి ప్రధాన ద్వారం బయట లేదా లోపల కూడా ఈ మొక్కను పెంచుకోవచ్చు అయితే పొరపాటున కూడా ఈ త్రాసుల మొక్కను దక్షిణ దిశ వైపు నాటకూడదు. దక్షిణ దిశలో త్రాసుల మొక్కను గనుక ఉంచితే మన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ ప్లాంట్ మనీ ప్లాంట్ కన్నా ఎంతో అనుకూల వాతావరణాన్ని కలిగిస్తుందని మన ఇంటికి పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుందని చెప్పాలి.