కొత్త ఇల్లు కొనుగోలు చేస్తున్నారా.. ఈ వాస్తు ఉన్న ఇల్లు దొరికితే మాత్రం మీరు అదృష్టవంతులే!

ప్రస్తుత కాలంలో చాలామంది కొత్తగా ఇంటిని నిర్మించుకోవడానికి బదులుగా ఇప్పటికే నిర్మించి ఉన్న ఇంటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కొత్త ఇల్లు కొనుగోలు చేయాలని భావించే వాళ్లు వాస్తు దోషాలు లేని ఇల్లును కొనుగోలు చేయడం ద్వారా అదిరిపోయే ప్రయోజనాలను పొందవచ్చు. వాస్తు దోషాలు లేని ఇంట్లో నివశించడం ద్వారా ప్రశాంతమైన జీవితాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది.

వాస్తు దోషాలు ఉన్న ఇంట్లో వేర్వేరు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు, ధనానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటే వాస్తు పండితులను సంప్రదించి పరిష్కార మార్గాలను తెలుసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఇంటి ప్రవేశ ద్వారం ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్య దిశలో ఉంటే మంచిది. తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశలో లివింగ్ రూమ్ ఉండాలి.

పశ్చిమ లేదా నైరుతి దిశలో ఫర్నిచర్ ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. పశ్చిమ దిశలో డైనింగ్ హాల్ ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. నైరుతి దిశలో డైనింగ్ ఏరియా ఏర్పాటు చేసుకుంటే మాత్రం నెగిటివ్ ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పడక గదిలో పూజామందిరం ఏర్పాటు చేసుకుంటే కుటుంబంలో కలతలు వచ్చే ఛాన్స్ ఉంటుంది.

పడక గదిలో మనుషుల ప్రతిబింబం వాటి అద్దాలలో కనిపించే విధంగా ఉండకూడదు. వంటగదిని ఇంటికి ఆగ్నేయ దిశలో నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఉత్తర లేదా తూర్పు గోడకు బాత్రూమ్ – టాయిలెట్ వాస్తు ఉండాలి. టాయిలెట్ వంటగది లేదా పూజా గదితో గోడను పంచుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చతురస్రాకారంలో లేదా దీర్ఘచతురస్రాకారంలో గదులు ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి.