ఇంట్లో బీరువా ఆ దిక్కులో పెడితే ఊహించని స్థాయిలో డబ్బే డబ్బు.. ఏం చేయాలంటే?

మనలో చాలామంది ఏ పని చేసినా డబ్బు కోసమే చేస్తారనే సంగతి తెలిసిందే. మనం ఇంట్లో పెట్టే బీరువా కూడా కొన్ని సందర్భాల్లో మన ఆర్థిక స్థితిని తెలియజేస్తుంది. ఇంట్లో బీరువాను ఎక్కడ పడితే అక్కడ పెడితే మాత్రం తీవ్రస్థాయిలో నష్టపోవాల్సి ఉంటుందని చెప్పవచ్చు. సమాజంలో ప్రస్తుతం ఎవరికి ఎక్కువగా డబ్బు ఉంటే వాళ్లకే గౌరవం లభిస్తుంది. ఎవరికైతే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందో వాళ్లకే ఎక్కువ మొత్తంలో డబ్బు లభిస్తుందని చెప్పవచ్చు.

మనలో చాలామంది నైరుతి భాగంలో బీరువాను పెడుతూ ఉంటారు. అయితే ఈ దిక్కులో బీరువాను పెట్టడం వల్ల నష్టమేనని వాస్తు నిపుణులు చెబుతున్నారు. బీరువాను వాయువ్యంలో పెట్టాలని అలా పెడితే మాత్రమే కలిసొస్తుందని పండితులు సూచనలు చేస్తున్నారు. ఉత్తరం వైపు చూస్తుండేలా బీరువాను ఉంచడం ద్వారా ఎలాంటి డబ్బు నష్టం జరిగే అవకాశాలు అయితే ఉండవని చెప్పవచ్చు.

నైరుతి మూలలో బీరువా పెడితే వచ్చిన డబ్బు వచ్చినట్టేవెళ్లిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. డబ్బును ఏదైనా ఒకచోట మాత్రమే ఉంచితే మంచిదని ఎక్కడ పడితే అక్కడ డబ్బు ఉంచడం ద్వారా నెగిటివ్ ఫలితాలు కలుగుతాయని పండితులు వెల్లడిస్తున్నారు. వాస్తు అనేది ఇంటికి మాత్రమే కాదని ఇంట్లో వస్తువులకు కూడా ఉంటుందని తెలుస్తోంది. కలపతో తయారు చేసిన బీరువాను కొంటే మంచిది.

ఇలాంటి బీరువా కొనుగోలు చేయడం ద్వారా పాజిటివ్ వైబ్స్ ఉండే అవకాశం ఉంటుంది. బీరువా ఫేసింగ్ ఉత్తరం, తూర్పు వైపునకు ఉండేలా చూసుకుంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. అదే సమయంలో అద్దాలు ఉండే బీరువాను ఎంచుకోకూడదు. అద్దాలు ఉండే బీరువా వల్ల నెగిటివిటీ ఎక్కువగా జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది.