YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి 2019వ సంవత్సర ఎన్నికలలో భాగంగా భారీ విజయాన్ని అందుకున్నారు సింగిల్ గా పోటీ చేసి ఏకంగా 151 స్థానాలలో ఈయన విజయం సాధించారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నింటిని దాదాపు నెరవేర్చారు ఇలా 90% హామీలను నెరవేర్చి ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో సంక్షేమ పథకాలను అందించారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో తాము 175 స్థానాలను కొట్టబోతున్నామని జగన్ ఎంతో నమ్మకం ప్రదర్శించారు.
ఇక జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం కోసం మరోవైపు తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో దిగారు ఇలా ఎన్నికలలో కూటమి పార్టీలు భారీ మెజారిటీని సాధించగా జగన్మోహన్ రెడ్డి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఇలా జగన్మోహన్ రెడ్డి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో ఈయన ప్రతిపక్షనేత హోదా కూడా కోల్పోయారు.
ఇకపోతే తాజాగా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఏర్పాటు చేసుకున్న ఇంటి గురించి ఓ వార్త వైరల్ గా మారింది. 2019 ఎన్నికలకు ముందు రాజధాని ప్రాంతాలలో ఇంటిని నిర్మాణం చేపట్టి గృహప్రవేశం చేసిన మొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ ఇంటి నిర్మాణం కారణంగానే ఆయన గత ఎన్నికలలో గెలిచారని వాదన కూడా వినిపించింది అయితే ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఆ ఇంటి చుట్టు పెద్ద ఎత్తున ఇనుప కంచెలు వేసిన విషయం మనకు తెలిసిందే. ఈ ఇంటిపై ఎన్నో రకాల విమర్శలు కూడా వచ్చాయి అది ఇలా లేకపోతే జైలా అంటూ కూడా చాలామంది విమర్శలు చేశారు.
ఇక జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికలలో ఓటమిపాలు కావడంతో కొంతమంది పండితులు వాస్తు లోపమే కారణమని చెప్పారట అందుకే వాస్తుకు అనుకూలంగా ఆ ఇంటిలో మార్పులు చేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఆ ఇనుప కంచెను తొలగించబోతున్నారని సమాచారం. ఇటీవలే దక్షిణ దిశలో కంచెను తీసేసారట. అలాగే సోమవారం రోజున తూర్పు, ఈశాన్యంలో కొన్ని వరుసలను తీసివేశారట. తూర్పు ఈశాన్యం మూసివేయడం మంచిది కాదని వాస్తు పండితులు తెలియజేస్తున్నారు.
ఈ విధంగా వాస్తుకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మార్పులు చేయడంతో జగన్మోహన్ రెడ్డికి కూడా ఇలాంటివి నమ్ముతారా అంటూ కొందరు కామెంట్లు చేయడం మరికొందరు మారాల్సింది ఇంటి వాస్తు కాదు నీ ఆలోచన విధానం అంటూ కూడా ఈయన పట్ల కామెంట్లు చేస్తున్నారు.
