ఈ మధ్య కాలంలో అల్లోపతి వైద్యులు సైతం కొన్ని మొక్కల ద్వారా ఊహించని స్థాయిలో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతున్నారు. అలాంటి మొక్కలలో పారిజాతం మొక్క కూడా ఒకటి. పారిజాతం పూలతో లక్ష్మీదేవిని పూజించడం వల్ల శుభ ఫలితాలు చేకూరుతాయి. ఆరెంజ్ కలర్ లో ఉండే పారిజాతం పుష్పాలు దగ్గు, గొంతునొప్పి సమస్యలకు దివ్యౌషధం అని చెప్పవచ్చు.
జ్వరం తగ్గించడంలో కూడా ఈ మొక్క యొక్క ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ ఆకుల నుంచి తయారు చేసిన నూనె ఒత్తిడి, ఆందోళన సమస్యలను దూరం చేస్తుంది. ఆయుర్వేద మందులలో వీటిని ఎక్కువగా వినియోగిస్తారు. అంటువ్యాధులు రాకుండా చేయడంలో ఈ మొక్క తోడ్పడుతుంది. ఈ ఆకులను కషాయం చేసుకుని తాగితే కీళ్ల నొప్పులు దూరమవుతాయి.
ఈ వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాకు చెక్ పెట్టడంలో ఈ మొక్క సహాయపడుతుంది. చర్మంపై మచ్చలు, ఇతర సమస్యలతో బాధ పడేవాళ్లు ఈ సమస్యలను సైతం దూరం చేసుకోవచ్చు. మలేరియా జ్వరంతో బాధ పడేవాళ్లు ఈ మొక్క ఆకులను తీసుకోవడం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ పొందవచ్చు. వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా చేయడంలో ఈ మొక్క ఆకులు తోడ్పడతాయి.
ఈ ఆకులను మెత్తగా నూరి తీసుకోవడం వల్ల గొంతు వాపు తగ్గడంతో పాటు శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వస్తుంది. పారిజాతం మొక్క వల్ల లాభాలే తప్ప నష్టాలు లేవని చెప్పవచ్చు. ఆయుర్వేద షాపుల ద్వారా సులువుగానే పారిజాతం మొక్క ఆకులను సులువుగా పొందవచ్చు.