Aalaram: చాలామంది ఉదయమే వారి పనులకు వెళ్లడం కోసం చాలా తొందరగా నిద్రలేవాలని భావిస్తారు. అయితే కొన్నిసార్లు మనకు తెలియకుండానే నిద్రపోతూ ఉంటాము అందుకే చాలామంది అలారం పెట్టుకుని మనం ఏ టైం కి నిద్రలేవాలో ఆ టైంకి నిద్ర లేస్తూ ఉంటాము.
అయితే కొన్నిసార్లు అలారం పెట్టుకుని నిద్రపోతున్న సమయంలో మనం చేసే చిన్న చిన్న తప్పులు వల్ల ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అసలు అలారం పెట్టుకుని నిద్రపోతే ఎలాంటి ప్రమాదాలు ఏర్పడతాయనే విషయానికి వస్తే…
మనం ఇంత సమయానికి లేవాలి అని అలారం పెట్టుకుంటాము అయితే అదే సమయానికి అలారం మోగగా మనం మొదటగా కళ్ళు తెరిచి చూసేది ఏంటి అంటే స్నూజ్ బటన్ . అలారం మోకగానే ఎవరు నిద్రలేయరు. ఇంకో ఐదు నిమిషాలు పడుకుందామని వెంటనే స్నూజ్ బటన్ నొక్కి నిద్రపోతూ ఉంటాము. ఇలా నిద్రపోవడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
స్నూజ్ బటన్ ను నొక్కి మరలా నిద్రపోవడం వల్ల మన శరీరం స్లీప్ అప్నియా అనే స్థితిలోకి వెళ్తుంది. దీని కారణంగా మనం మరలా స్నూజ్ బటన్ ను నొక్కి నిద్రపోయినప్పటికి ఎటువంటి ఫలితం ఉండదు. అంతేకాకుండా ఇది మనపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.దీంతో మనం ఆశించిన రిఫ్రెష్ లభించదు. ప్రతిరోజు ఇలా చేయటం వల్ల మనకు ఇంకా అలసిపోయిన భావన కలగడమే కాకుండా మన నిద్రకు కూడా భంగం కలిగి ఆరోజు మొత్తం చాలా డల్ గా గడుస్తుంది తప్ప ఎలాంటి చలాకీతనం ఉండదు. అందుకే మనం సరైన సమయానికి నిద్ర లేవగలిగితేనే అలారం పెట్టుకుని లేస్తే బాగుంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.