మనలోఒత్తిడిని జయించి రోజంతా ఉల్లాసంగా ఉండాలంటే ఇలా ప్రయత్నించండి!

రోజు ఊరుకుల పరుగుల జీవితంలో చాలామంది మానసిక ఆనందాన్ని కోల్పోతూ తీవ్రమైన మానసిక, శారీరక ఒత్తిడినీ అనుభవిస్తుంటారు. దీంతో ఏ పని మీద ఆసక్తి కలగక రోజంతా నిరుత్సాహంగా నీరసంగా కనిపిస్తుంటారు ఈ సమస్య నుంచి బయటపడడానికి మనలో శారీరక, మానసిక ఆనందాన్ని పెంపొందించు కోవడానికి మన రోజూ వారి కార్యకలాపాలు కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది. మొదట మనం సమయానికి నిద్రపోవడం, నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. ఎక్కువసేపు కూర్చొని కంప్యూటర్ స్క్రీన్ చూడటం వల్ల కళ్ళపై ఒత్తిడి పెరిగి తలనొప్పి, కళ్ళల్లో కారడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి కళ్ళకు రిలాక్స్ ఇవ్వడం మంచిది. దీంతో ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుంది.

మన సంపూర్ణ ఆరోగ్యానికి ఎనిమిది గంటల నాణ్యమైన నిద్ర తప్పనిసరి ఈ విషయంలో మీరు ఎలాంటి ఛాయిస్ తీసుకోరాదు. అర్ధరాత్రి వరకు మేల్కొని ఉదయం 8 గంటలకు నిద్ర లేస్తే అది మంచి పద్ధతి కాదు. రాత్రలు త్వరగా పడుకొని ఉదయం ఐదు గంటలకి నిద్రలేచి ఒక గంట సేపు యోగ, వ్యాయామం వంటి అలవాట్లు చేసుకుంటే మెదడు చురుగ్గా పనిచేసి ఆ రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు.
నాణ్యమైన నిద్ర కోసం గోరువెచ్చని పాలను తాగండి, పడుకునే ముందు కంప్యూటర్, మొబైల్స్ వంటి వాటికి దూరంగా ఉండండి, రాత్రి పడుకునే ముందు అత్యధిక కొవ్వు మసాలా కలిగిన ఆహారాన్ని తీసుకోరాదు. ఈ జాగ్రత్తలు పాటిస్తే సుఖప్రదమైన నిద్ర కలిగి ఉదయం త్వరగా నిద్ర లేవడానికి అవకాశం ఉంటుంది.

నిద్ర మత్తు నుంచి బయటపడడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి చాలామంది కాఫీ, టీ వంటివి ఎక్కువగా తాగుతుంటారు. కాఫీ,టీ వంటి వాటిలో కెఫిన్ ఆల్కలాయిడ్ ఎక్కువగా ఉంటుంది.శరీరంలో కెఫిన్‌ నిల్వలు పెరిగితే ఆ ప్రభావం నిద్రపై పడుతుంది. నిద్రా సమయం తగ్గితే మెదడు ఒత్తిడికి గురై మానసిక సమస్యలు తలెత్తుతాయి. అందుకే మూడు కప్పులుకు మించి కాఫీ లేదా టీ తాగకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఆఫీసుల్లో ఒకేచోట కూర్చుని ఎక్కువ సేపు పని చేస్తే కండరాలు, నరాలు పట్టేసి శరీరానికి ఆక్సిజన్ సరిగా అందక తీవ్రమైన ఒత్తిడినీ అనుభవిస్తున్నామన్న భావన కలుగుతుంది. అందుకే గుర్తొచ్చినప్పుడల్లా కాసేపు అటు ఇటు తిరగడం మంచిది.