చలికాలంలో వెచ్చగా ఉండడానికి వీటిని మోతాదుకు మించి తాగుతున్నారా…. ఆరోగ్య సమస్యలు తప్పవు!

చలికాలంలో శరీర వేడిని పెంచుకోవడానికి చాలామంది కాఫీ, టీ వంటి పానీయాలను ఎక్కువగా సేవిస్తుంటారు. ఆ క్షణం హాయిగా అనిపించొచ్చు కానీ తర్వాత కాఫీ టీ లో ఉన్న కెఫెన్ వంటి ఆల్కలాయిడ్స్ మన ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి కాఫీ టీ వంటి పానీయాలను పరిమితంగా తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. మోతాదుకు మించి అంటే ఒకరోజు ఒక వ్యక్తి 4 నుంచి 6 కప్పుల టీ, కాఫీ వంటి పానీయాలను సేవిస్తూ కలిగే అనారోగ్య సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అతిగా కాఫీ, టీ తాగే వారిలో మానసిక ఒత్తిడి, డిప్రెషన్, చిరాకు వంటి సమస్య తలెత్తుతుంది కారణం వీటిలో అధికంగా ఉండే కెఫెన్ ఆల్కలాయిడ్ మనలో నిద్రను కలగజేసే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని దెబ్బతీస్తుంది. ఫలితంగా రాత్రిళ్ళు నిద్రలేమి సమస్య తలెత్తి తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతారు. ఫలితంగా నీరసం అలసట వంటి సమస్యలు తలెత్తి ఏ విధమైన పనుల్లో ఉత్సాహం చూపించరు.

అతిగా టీ కాఫీలు తాగడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి ఫలితంగా ప్రేగుల్లో మంట, కడుపులో మంట, గ్యాస్ట్రిక్ అజీర్తి మలబద్ధకం వంటి అనేక జీర్ణ సంబంధిత సమస్యలతో ప్రతిక్షణం బాధపడాల్సి వస్తుంది. అతిగా టీ తాగితే అయితే నాడీ కణాలు, మెదడు కండరాలు దెబ్బతిని జ్ఞాపకశక్తి మందగిస్తుంది. అధిక రక్తపోటు, గుండెపోటు సమస్యతో బాధపడేవారు కాఫీ టీలు ఎక్కువగా తాగితే సమస్య మరింత తీవ్రమవుతుంది. గుండెల్లో మంట, బ్లడ్ ప్రెజర్ పెరగడం వంటి సమస్యల తలెత్తుతుంది. శరీరంలో క్యాలరీలు అధిక స్థాయిలో లభ్యమయి శరీర బరువు నియంత్రణ కోల్పోతుంది ఫలితంగా డయాబెటిస్ వ్యాధికి కారణం కావచ్చు. ఇప్పటికే డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారు రక్తంలో గ్లూకోజ్ నిలువలు అమాంతం పెరిగి డయాబెటిస్ వ్యాధి ప్రమాదకరంగా మారవచ్చు.