నెగిటివ్ ఆలోచనలతో ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారా.? ఇలా ప్రయత్నించి చూడండి!

istockphoto-1270842577-170667a

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఏదో రకమైన ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. దీనికి కారణాలు ఏవైనా కావచ్చు ఈ మానసిక సమస్యలు మాత్రం చాప కింద నీరుల మనల్ని చుట్టుముట్టి మన ఆలోచనలను
నెగటివ్‌ థింకింగ్‌ వైపు అడుగులు వేసేలా చేసి మన బంగారు భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా తీవ్ర మానసిక శారీరక రుగ్మతలకు కారణమవుతుంది ఒత్తిడి ,ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలకు దూరంగా ఉండాలంటే రోజువారీ కార్యకలాపాలో కొన్ని పద్ధతులు నియమాలు పాటిస్తే సరిపోతుంది వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నీలో తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన సమస్య తలెత్తినప్పుడు ఆలోచన విధానం కూడా గతి తప్పుతుంది ఈ సమస్య నుంచి బయటపడడానికి
15 నిమిషాల పాటు యోగా చేయాలి. దీంతో మానసిక స్థితిని చక్కదిద్దవచ్చు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. యోగా చేయలేకపోతే రోజుకు 15 నిమిషాల వాకింగ్‌ అయినా చేయాలి. దీనివల్ల ఆందోళన సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. మనలో మానసిక ఆందోళన తలెత్తినప్పుడు శ్వాస తీసుకునే వేగం కూడా పెరుగుతుంది. ఈ పరిస్థితిలో శ్వాసను నియంత్రించడం అవసరం.దీని కోసం మీరు 1 నుంచి 4 వరకు లెక్కించి లోతైన దీర్ఘ శ్వాస తీసుకోవాలి. దీనివల్ల హృదయ స్పందన రేటు కంట్రోల్‌ అవుతుంది. శ్వాసపై దృష్టి పెట్టడం వల్ల క్రమంగా ఆందోళనను అధిగమించవచ్చు.

మీలో మానసిక ఆందోళన తలెత్తినప్పుడు ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి ఈ ఆలోచనలన్నీ ఒక పేపర్ పైన రాయడం అలవాటు చేసుకుంటే క్రమంగా మీలో ఆందోళన తగ్గి విశ్రాంతి పెరుగుతుంది. అలాగే మీలో వచ్చే నెగటివ్ ఆలోచనలన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది. చాలామంది తీవ్ర ఒత్తిడి సమస్య నుంచి బయటపడడానికి కాఫీ, టీ , ధూమపానం, ఆల్కహాల్ సేవించడం వంటి పొరపాట్లు చేస్తుంటారు. తాత్కాలికంగా ప్రశాంతంగా అనిపించవచ్చు కానీ భవిష్యత్తులో తీవ్ర మానసిక శారీరక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కనుక సాధ్యమైనంత వరకు చెడు అలవాట్లకు దూరంగా ఉండండి.