పిల్లల్లో తీవ్ర అనారోగ్యానికి కారణం అయ్యే నులిపురుగు సమస్యకు కారణాలు..? నివారణ చర్యలు!

పిల్లల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపే అంశాల్లో నులి పురుగు సమస్య కూడా ప్రధానమైనదిగానే చెప్పొచ్చు.చాలామంది నులిపురుగు సమస్యను లైట్ గా తీసుకొని వదిలేస్తుంటారు ఫలితంగా చిన్నపిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుదల లోపిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రోజుల్లో దాదాపు 80 పిల్లలను నులిపురుగు సమస్య వేధిస్తోంది. ఈ సమస్య నుంచి పిల్లలను రక్షించడానికి కేంద్ర రాష్ట్ర
ప్రభుత్వాలు సంవత్సరానికి రెండుసార్లు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఆల్బెండజోల్ టాబ్లెట్ లను నులిపురుగుల నివారణకు పంపిణీ చేయడం జరుగుతుంది.

పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీసే నులిపురుగులను కొన్ని ప్రాంతాల్లో బద్దె పురుగులు లేదా సూది పురుగులు అని కూడా పిలుస్తారు.చిన్నపిల్లలు మట్టిలో ఆడుకొని చేతులు శుభ్రం చేసుకోకుండా ఆహారాన్ని తింటే నోటి ద్వారా పొట్ట, పేగుల్లోకి నులి పురుగులు చేరుతాయి. అలాగే గోర్లను ఎక్కువగా పెంచడం,బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయడం, కాళ్లకు చెప్పులు వేసుకోకుండా తిరగడం, వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం, రోడ్ల వెంబడి అమ్మే కలుషిత ఆహారాన్ని తినడం వంటి కారణాలతో నులిపురుగులు కడుపులోకి చేరి పిల్లలు తీసుకునే పోషకాహారాన్ని శరీరం గ్రహించడంలో అడ్డంకులు కలిగించి పిల్లల్లో మానసిక శారీరక ఎదుగుదలలో ఆటంకం కలిగిస్తాయి. ఫలితంగా రక్తహీనత, కడుపు నొప్పి,తలనొప్పి,వాంతులు, నిద్రలేమి వంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుంది.

నులి పురుగు సమస్య నుంచి రక్షణ పొందడానికి మన ఇంట్లో కొన్ని చిట్కాలను కూడా పాటించవచ్చు
ఎన్నో ఔషధ గుణాలున్న లవంగాలను నీటిలో నానబెట్టి ఆ నీటిని సేవిస్తే నులిపురుగు సమస్య దూరమవుతుంది.వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉండటం వల్ల నులిపురుగులను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రెండు వెల్లుల్లి రెబ్బలను బాగా దంచి ఆ రసంలో క గ్లాసు నీటిని కలిపి తాగించడం ద్వారా కడుపులో నులిపురుగులను నివారించవచ్చు. పిల్లల చేతి గోర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి. బయటికి వెళ్ళినప్పుడు పాదరక్షకులు తప్పనిసరిగా ధరించేలా చూడాలి. తినేటప్పుడు తప్పనిసరిగా హ్యాండ్ వాష్ తో చేతులను శుభ్రంగా కడగాలి. ఇలాంటి రక్షణ చర్యలు చేపడితే పిల్లలను నులిపురుగు సమస్యకు దూరంగా ఉంచవచ్చు.