సాధారణంగా మనం తీసుకునే ఆహార పదార్థాలు జీర్ణం అయిన తర్వాత పోషక విలువలని శరీరం గ్రహిస్తుంది. జీర్ణం కానీ వ్యర్ధాలతో సహా శరీరంలోని చెడు మలినాలన్నీ మలవిసర్జన ద్వారా బయటికి వెళ్లడం సర్వసాధారణం.అలాకాకుండా మలవిసర్జన సులువుగా కాకుండా మలద్వారం దగ్గర తీవ్రమైన నొప్పి రక్తం కారడం వంటి సమస్యలతో నిత్యం బాధపడుతుంటే దాన్ని మలబద్ధక సమస్య అంటారు. ఈ సమస్య సాధారణమైనదే అనిపించినప్పటికీ దీర్ఘకాలం కొనసాగితే శరీరంలోని చెడు మలినాలు అలాగే ఉండిపోయి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.
ఒకరోజులో రెండుసార్లు మలవిసర్జనలు చేస్తేనే ఆరోగ్యవంతమైన వ్యక్తిగా పరిగణిస్తారు. అలా కాకుంటే మీరు అనారోగ్యంతో ఉన్నట్టే లెక్క. మలబద్దక సమస్యకు అసలు కారణం మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థం లోపించడం, నీళ్లు తక్కువగా తాగడం, ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వంటి కారణాలను ప్రధానంగా చెప్తుంటారు. ముఖ్యంగా ప్రతిరోజు మనం ఫైబర్ తక్కువగా ఉండే మైదా ఉత్పత్తులు, జంక్ ఫుడ్స్, సాఫ్ట్ డ్రింక్స్, చాక్లెట్స్ వంటివి అధికంగా ఉంటే జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. దాంతో మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. కావున అత్యధికంగా ఫైబర్ ఉండే ద్రాక్ష ,బొప్పాయి, పైనాపిల్ వంటి పండ్లను, కూరగాయలను, చిరుధాన్యాలను ఎక్కువగా ఆహారంలో తీసుకోవాలి.
మీరు ఏదో ధ్యాసలో పడి నీళ్లు తాగడం తక్కువ చేస్తే ఒంట్లో లవణాలు అలాగే నిల్వ ఉండిపోయి తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.మన శరీరంలో నీటి శాతం తక్కువైనప్పుడు మూత్రం మరియు మలం నుంచి నీటిని స్వీకరిస్తుంది దాంతో మలం గట్టిగా తయారై మలబద్ధక సమస్య ఏర్పడుతుంది. సగటున ఒక వ్యక్తికి రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీటిని తాగడం తప్పనిసరి. ప్రతిరోజు పెరుగుకు బదులు పల్చటి మజ్జిగని సేవించడం మరీ మంచిది. మీరు మలబద్ధక సమస్యతో బాధపడుతున్నట్లయితే తరచూ తీవ్రమైన తలనొప్పి, నడుము నొప్పి ,గుండెల్లో పట్టుకోవడం, వాంతి వికారంగా ఉండడం, ముఖంపై మొటిమలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి వెంటనే గ్రహించి వైద్య సలహాలు తీసుకోవడం మంచిది.