అన్ని అనారోగ్య సమస్యలకు మొదటి కారణం మనం తీసుకునే ఆహారంలో మన ఆరోగ్యానికి అవసరమైన పోషక పదార్థాలు,ఔషధ విలువలు లభించకపోవడమే ఈ రోజుల్లో మనం ఎక్కువగా తినే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వాటిలో అత్యధికంగా కేలరీలు, చెడు కొలెస్ట్రాల్ నిల్వలు ఉండడంతో తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.ఈ సమస్యల నుంచి బయటపడాలంటే మన రోజువారి ఆహారంలో విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ,ఫైబర్ క్యాల్షియం, ఐరన్ ,జింక్, మెగ్నీషియం వంటి సహజ మూలకాలు సమృద్ధిగా లభించే చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవాలని పోషకాహార నిపుణులు మనల్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.
చిరుధాన్యాలైన కొర్రలు, జొన్నలు,సజ్జలు, రాగులు, ఊదలు, సామలు, ఆరికలు వీటిలో ఏదో ఒక చిరుధాన్యంతో తయారుచేసిన ఆహారాన్ని ప్రతిరోజు తింటే పౌష్టికాహార లోపం తొలగిపోవడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడంలో కీలకపాత్ర పోషిస్తాయి
ముఖ్యంగా చిరుధాన్యాల్లో కార్బొహైడ్రేట్స్,ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్‌తోపాటు అత్యధికంగా ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల తిన్న ఆహారం కొద్దికొద్దిగా మాత్రమే గ్లూకోజ్‌గా మారుతుంది. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ నిల్వలు క్రమబద్ధీకరించి టైపు1, టైపు2 డయాబెటిస్ వ్యాధినీ నియంత్రణలో ఉంచుతుంది.
చిరుధాన్యాల్లో అత్యధికంగా లభించే కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ వంటి మూలకాలు మన శరీర నిర్మాణ దృఢత్వానికి సహాయపడే ఎముకల, కండరాల ఆరోగ్యాన్ని రక్షించి ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడడమే కాకుండా భవిష్యత్తులో వచ్చే ఆర్థరైటిస్, ఆస్తియోఫోరోసిస్, నరాల బలహీనత, కండర క్షీణత వంటి సమస్యల ప్రమాదం నుంచి మనల్ని రక్షిస్తుంది. శరీరంలో ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నందున చర్మ సమస్యలు, థైరాయిడ్ ,కిడ్నీ ఇన్ఫెక్షన్, ఫ్యాటీ లివర్ సమస్యలను తగ్గిస్తుంది. చిరుధాన్యాల్లో అమినో యాసిడ్స్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించి ఉబకాయం, రక్తపోటు, గుండెపోటు, వ్యాధులను నియంత్రణలో ఉంచుతుంది.