స్వీట్లు ఎక్కువగా తినడం వల్ల షుగర్ వస్తుందా.. షుగర్ విషయంలో అసలు నిజాలివే!

మనలో చాలామంది ఎంతో ఇష్టంగా స్వీట్లు తింటారనే సంగతి తెలిసిందే. అయితే స్వీట్లు ఎక్కువగా తినడం వల్ల షుగర్ వస్తుందని చాలామంది భావిస్తున్నారు. స్వీట్లు తినడం వల్లే షుగర్ వస్తుందని కచ్చితంగా చెప్పలేమని వైద్యులు పేర్కొన్నారు. టైప్ 1 డయాబెటిస్ ఒక ఆటోఇమ్యూన్ వ్యాధి అని ఇందులో రోగనిరోధక వ్యవస్థ ఇన్సూలీన్ ఉత్పత్తి చేసే కణాలపై దాడి చేయడం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.

టైప్ 2 వ్యాధి మాత్రం జీవన శైలికి సంబంధించిన అంశాలతో ముడిపడి ఉంటుందని ఊబకాయం సమస్యతో బాధ పడేవాళ్లకు షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. శరీరంలోని కీలక అవయవాల చుట్టూ కొవ్వు చేరితే కూడా షుగర్ బారిన పడే అవకాశాలు అయితే ఉంటాయి. రక్తంలో చక్కెరలు పెరిగి షుగర్ వ్యాధికి దారి తీసే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు.

చక్కెరలు అధికంగా ఉంటే పానీయాలను ఎక్కువగా తాగేవాళ్లకు టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రోజుకు ఒకటి లేదా రెండు చక్కెర పానీయాలు తాగినా షుగర్ వ్యాధి బారిన పడే అవకాశాలు 26 శాతం మేర పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. షుగర్ డ్రింక్స్ వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయని చెప్పవచ్చు. శరీరంలోని కణాలు ఇన్సులీన్‌కు స్పందించకపోవడాన్నే ఇన్సులీన్ రెసిస్టెన్స్ వచ్చి షుగర్ బారిన పడతామని చెప్పవచ్చు.

మార్కెట్లో లభించే పానీయాల్లో రిఫైన్డ్ చక్కెరలు జత చేయడం వల్ల షుగర్ వచ్చే సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. పండ్లు వంటి పదార్థాల్లో సహజసిద్ధమైన చక్కెరలు ఉండగా ఇప్పటికే షుగర్ తో బాధ పడేవాళ్లు మాత్రం వైద్యుల సలహాలు తీసుకుంటే మంచిది.