క్యాన్సర్ ప్రమాదాన్ని ఎదుర్కోవాలంటే మీ రోజు వారి డైట్ లో ఇవి తప్పనిసరి!

cancer-cells-1011146302-iStock_Mohammed-Haneefa-Nizamudeen

క్యాన్సర్ తో బాధపడే వారి సంఖ్య నానాటికి పెరుగుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్యాన్సర్ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఇప్పటి నుంచి రోజు వారి డైట్ లో కొన్ని ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి అప్పుడే భవిష్యత్తులో క్యాన్సర్ ప్రమాదం నుంచి రక్షణ పొందవచ్చు. క్యాన్సర్ వ్యాధిని స్లో పాయిజన్ గా చెప్పొచ్చు ఎందుకంటే వ్యాధి ముదిరేంతవరకు దీని లక్షణాలు బయటపడవు కావున శరీరంలో క్యాన్సర్ కణాలను నియంత్రించే ఔషధ గుణాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే ఈ ప్రమాదం నుంచి కొంత రక్షణ పొందవచ్చు.

ప్రతిరోజు మన డైట్ లో తప్పనిసరిగా తప్పనిసరిగా విటమిన్ సి,యాంటీ ఆక్సిడెంట్, ప్రోటీన్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా లభించే చిరుధాన్యాలైన రాగులు, కొర్రలు, జొన్నలు, సజ్జలు వంటివి ఆహారంగా ఉండునట్లు చూసుకోవాలి.అలాగే ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉన్న డ్రై ఫ్రూట్స్, గుడ్డు, చేపలను ఆహారంగా తీసుకుంటే శరీరంలో పెరిగే క్యాన్సర్ కణాలను నియంత్రించే ఇమ్యూనిటీ శక్తి మనలో బలపడుతుంది. వాల్‌నట్స్‌లో క్యాన్సర్‌తో పోరాడే టోకోఫెరోల్స్,ఫైటో స్టెరాల్స్ రొమ్ము క్యాన్సర్, ఉదర క్యాన్సర్ వంటి క్యాన్సర్ కణాలను నియంత్రించడంలో సహాయపడతాయి కావున ప్రతిరోజు ఉదయాన్నే నానబెట్టిన వాల్ నట్స్ తింటే మంచి ఫలితం ఉంటుంది.

ప్రతిరోజు పాలలో చిటికెడు పసుపు వేసుకొని సేవిస్తే పసుపులో ఉండే యాంటీ క్యాన్సర్ గుణాలు,కర్కుమిన్ అనే రసాయనం రొమ్ము ,ఉదర, బ్లడ్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది.తరచు టమోటో ను ఆహారంగా తీసుకోవడంతో ప్రతిరోజు టమోటో జ్యూస్ సేవిస్తే టమోటోలో క్యాన్సర్ ను అదుపు చేసే లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఫైటోకెమికల్‌ను కలిగి ఉంటుంది. లైకోపీన్ ప్రోస్టేట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. రోజుకు రెండు వెల్లుల్లి రెబ్బలను ఆహారంగా తీసుకుంటే భవిష్యత్తులో వచ్చే అన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాల నుంచి రక్షణ పొందవచ్చు.