సాధారణంగా వృద్ధాప్యంలో వచ్చే కంటి సమస్యలు ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ అతి చిన్న వయస్సులోనే ఎదుర్కొంటున్నారు. కంటి సమస్యలు తలెత్తడానికి కారణాలను పరిశీలిస్తే పోషకాహార లోపం ప్రధాన కారణమని చెప్పొచ్చు ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, బీటా కెరోటిన్, ఒమేగా 3 ఫ్యాటి ఆమ్లాలు లోపించడమే. మరియు ఈ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు గంటల తరబడి మొబైల్స్, కంప్యూటర్స్ చూడడం వల్ల వీటి నుంచి వెలుపడే ప్రమాదకర నీలి కిరణాలు కంటి చూపుకు అవసరమైన రెటీనా పై తీవ్ర ప్రభావం చూపిస్తోందని అనేక సర్వేలో వెల్లడింది.
కళ్ళు సున్నితమైన అవయవాలు వీటి విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చిన్నపిల్లలను స్మార్ట్ ఫోన్ కు దూరంగా ఉంచడం మంచిది. అలాగే రోజువారి ఆహారంలో విటమిన్ ఏ సమృద్ధిగా కలిగిన క్యారెట్ జ్యూస్ ను సేవిస్తే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు పాలకూర జ్యూస్ సేవిస్తే ఇందులో ఉండే విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లు కంటి చూపును మెరుగు పరుస్తాయి.పాలకూర లో ఉన్న బీటా కెరోటిన్ కళ్లపై అతినీలలోహిత కిరణాల ప్రభావాన్ని తగ్గించి కంటి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.
ప్రతిరోజు ఉసరి రసాన్ని సేవిస్తే ఇందులో ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతోపాటు కంటి సమస్యలను తొలగిస్తుంది. ముఖ్యంగా గుడ్డు, చేపల్లో విరివిగా లభించే విటమిన్ ఏ, ఈ ఒమేగా-3 ఫాటీ ఆమ్లం అనేక కంటి సమస్యలను నయం చేసి రెటీనా పనితీరును మెరుగుపరుస్తుంది.బ్లూ బెర్రీ లో పుష్కలంగా లభించే యాంథోసైనిన్స్ ఆమ్లం, విటమిన్-సి కళ్ళు పొడిబారడం, రే చీకటి వంటి సమస్యలను తొలగించి కంటిచూపును మెరుగుపరుస్తుంది. బాదం పప్పు,మిస్ట్రీ,సోంపు మిశ్రమాన్ని పొడిగా చేసి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పాలలో కలిపి సేవిస్తే ఇందులో ఉండే ఔషధ గుణాలు భవిష్యత్తులో వచ్చే అనేక కంటి సమస్యలను నివారిస్తుంది.