ఈ రోజుల్లో చాలామంది అతి చిన్న వయస్సులోననే థైరాయిడ్ సమస్యను ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య మరి తీవ్రంగా ఉందని అనేక సర్వేల్లో వెల్లడింది. థైరాయిడ్ సమస్య తలెత్తడానికి కారణాలు అనేకం ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, జన్యు సంబంధమైన కారణాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈరోజు మనం థైరాయిడ్ గ్రంథి పనితీరులో వ్యత్యాసం ఏర్పడితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు? థైరాయిడ్ సమస్యకు దూరంగా ఉండాలంటే ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి? అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మెడ కింది భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి చేసి శరీర నిత్యజీవక్రియలను నియంత్రించడంలో సహాయపడుతుంది. థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ హార్మోన్ సేవించడంలో లోపాలు తలెత్తితే శరీర బరువు పెరగడం లేదా తగ్గడం , నీరసం అలసట వంటి సమస్యలు, మలబద్ధకం, జుట్టు రాలడం, చర్మం పొడి వారం, చలి ఎక్కువగా అనిపించడం, ఆకలి మందగించడం, స్త్రీలలో నెలసరి కరెక్టుగా ఉండకపోవడం, గర్భస్రావం వంటి అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
థైరాయిడ్ గ్రంధి పనితీరు పెరుగు పడడానికి రోజువారి ఆహారంలో విటమిన్ సి సమృద్ధిగా కలిగిన పండ్లు కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి ముఖ్యంగా ఉసిరికాయలను తింటే వీటిల్లో ఉండే అత్యధిక విటమిన్ సి, సెలీనియం, జింక్ వంటివి థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది. మొలకెత్తిన పెసలు గింజలను ఆహారంగా తీసుకుంటే వీటిల్లో ఉండే అయోడిన్, ఫైబర్ జింక్, కాపర్ వంటి మూలకాలు థైరాయిడ్ సమస్యకు చెక్ పెడతాయి. అలాగే రోజువారి ఆహారంలో అయోడిన్ సమృద్ధిగా ఉండే పెరుగు, గుమ్మడి గింజలు, మిరియాలు, పెప్పర్మెంట్ ఆయిల్ మరియు ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉన్న అన్ని ఆహార పదార్థాలను నిక్షేపంగా తినొచ్చు.
ఇప్పటికే థైరాయిడ్ వ్యాధితో బాధపడేవారు ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. రోజువారి ఆహారంలో పాల ఉత్పత్తులను, ముల్లంగి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రోకలీ, పచ్చళ్ళు, రెడ్ మీట్ వంటి ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలి. ఆల్కహాల్ , ధూమపానం , కాఫీ టీ వంటివి తక్కువగా తాగాలి. మరియు శారీరక శ్రమ కలిగిన వ్యాయామం ,యోగా వంటివి అలవాటు చేసుకుంటే మంచిది.