మానవ జీవనంలో వయస్సు కాస్త పెరుగుతున్నప్పుడు అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. అందులో కొన్ని మనం చేసే తప్పిదాల వల్ల సంభవిస్తాయి. ముఖ్యంగా మనం తెలుసుకోదగినవి ఏడు సూచనలు మన జీవన విధానంలో అలవాటు చేసుకుంటే ఆరోగ్య సమస్యలు ఉండవు.
గాలి, నీరు, మంచి ఆహారం, మలవిసర్జన, వ్యాయామం, సరిపడ నిద్ర, మంచి ఆలోచన విధానం. సక్రమంగా తీసుకోగలిగితే ఆరోగ్యం అనేది పుష్కలంగా ఉంటుంది. ప్రతి చిన్న దానికి మెడిసిన్ వేసుకోవడం, వైద్యున్ని సంప్రదించడం అవసరం ఉండదు. ఉదయం లేవగానే కాస్త వ్యాయామం చేయాలి.
శరీరమంతా కదిలేలా చక్కటి వ్యాయామం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఉదయం మొలక విత్తనాలు మధ్యాహ్నం కొన్ని ఫలాలు రాత్రి మితిమీర కుండా కాస్త కడుపు ఖాళీగా ఉండే విధంగా భోజనం ప్లాన్ చేసుకోవాలి. ఆయిల్ ఫుడ్ ను, బయటి ఫుడ్ ను తక్కువగా తీసుకోవడం మంచిది.
శరీరానికి కచ్చితంగా ఎనిమిది గంటల విశ్రాంతి ప్రతిరోజు తీసుకోవాల్సిందే. విశ్రాంతి సమయంలో ఏ విధమైన ఆలోచనలు, టెన్షన్లు లేకుండా చూసుకోవాలి. మొదట్లో కాకపోయినా కాలక్రమేనా అలవాటు చేసుకుంటే బాగుంటుంది. రోజుకు నాలుగు నుంచి నాలుగున్నర లీటర్ల వరకు నీరును తీసుకోవాలి.
ఇక ముఖ్యంగా మలవిసర్జన ను, మూత్రంను ఎక్కువసేపు ఆపకుండా కార్యక్రమాలు పూర్తి చేయాలి. ఎప్పుడో ఒకసారి అయితే పర్వాలేదు పనిలో ఉండి తర్వాత వెళ్దాం లే అని ప్రతిసారి ఆపుకోవడం వల్ల కూడా ఆరోగ్యం దెబ్బతినే ఆస్కారం ఉంది. మన ఆలోచన విధానం మంచిగా ఉండాలి.
ప్రతి సమస్యకు కచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది కాబట్టి కోపాలు, చిరాకు, టెన్షన్ వంటివి తీసుకోకూడదు. పాజిటివ్ థింకింగ్ ను అలవర్చుకోవాలి. ఇదే ప్రస్తుతం మారుతున్న జీవనశైలిలో మనిషి మనుగడకు కీలకం. దీని ద్వారానే అనవసర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మన చుట్టుపక్కల జంతువులను గమనించినట్లయితే ఉదయం కావాల్సినంత నీరు, కావలసినంత ఆహారం తీసుకొని రాత్రంతా విశ్రాంతి తీసుకుంటాయి.
కాబట్టి వాటి ఆరోగ్యం ఎప్పుడు మెరుగ్గా ఉంటుంది. అవి మూత్రం విసర్జన ను ఆపుకోవు వెంటనే విసర్జిస్తాయి. ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని మనకు ఇష్టం వచ్చినట్టు కాకుండా శరీరానికి అవసరమైనంత నీరు ఆహారం విశ్రాంతి అలాగే కాస్త వ్యాయామం అందిస్తే శరీరం మనకు ఆరోగ్యం ఇస్తుంది. జంతువులు ఎక్కువగా అనారోగ్యం బారిన పడవు. ఇదే మీకు చక్కటి నిదర్శనం. చనిపోయే వరకు ఆరోగ్యంగా, ఎవరి మీద ఆధారపడకుండా జీవించవచ్చు.