గుండెపోటు సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ జాగ్రత్తలు మీకోసమే!

ప్రస్తుత కాలంలో చిన్న, పెద్ద తేడా లేకుండా హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోవడం వంటివి రోజు వినడం, చూడడం జరుగుతుంది. ఇది సర్వసాధారణంగా మారిపోయింది. గుండె నొప్పి కి ప్రధానంగా కారణం అధిక బరువు పెరగడం, మధుమేహం, రక్తంలో కొలెస్ట్రాల్ పెరగడం, ధూమపానం, అధిక రక్తపోటు, కొన్ని జన్యుపరమైన కారణాలు ఉంటాయి.

మనలో కొంతమందికి గుండె నొప్పికి, గ్యాస్ ట్రబుల్ వల్ల వచ్చిన చాతి నొప్పికి తేడా తెలియక హార్ట్ ఎటాక్ వచ్చింది అని అపోహ పడుతుంటారు. అయితే హార్ట్ ఎటాక్ వచ్చిన వ్యక్తిలో గుండె భారంగా, బరువుగా అనిపిస్తుంది. గట్టిగా పిండినట్టుగా లేదంటే ఏదైనా బలమైన వస్తువుతో గుండెను నొక్కినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు గుండె నుండి ఆ నొప్పి ఎడమ చెయ్యి నరాల వరకు ఉంటే ఇంకా ఇది పంటికి కూడా చేరుతుంది. అప్పుడు గుండెనొప్పి వచ్చింది అని మనం అనుకోవచ్చు. అప్పుడు దీనిని ఒక లక్షణంగా పరిగణించవచ్చు.

నడిస్తే గుండెనొప్పి పెరిగితే అది హార్ట్ ఎటాక్ అయ్యే అవకాశం ఉంది. కానీ గ్యాస్ ట్రబుల్ వల్ల వచ్చిన నొప్పి నడిస్తే పెరగదు. కాబట్టి నడిస్తే గుండెనొప్పి పెరిగినట్లయితే అటువంటి వ్యక్తిని నడిపించకుండా హాస్పటల్ కు తీసుకువెళ్లాలి. హార్ట్ ఎటాక్ ఉన్న వ్యక్తి నడిస్తే గుండెపై ఒత్తిడి బాగా పెరుగుతుంది. తరువాత ఆయసం వచ్చినా, చెమటలు పట్టిన అది హార్ట్ ఎటాక్ కిందికే వస్తుంది ఎందుకంటే గ్యాస్ ట్రబుల్ వచ్చిన వ్యక్తికి ఆయసం, చెమటలు పట్టవు.

అందరికీ అందుబాటులో ఉండే పల్స్ ఆక్సి మీటర్ ను మనతోపాటు ఉంచుకోవడం చాలా మంచిది. ఈ మీటర్ లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ చూపిస్తే అది హార్ట్ ఎటాక్ అని అనుకోవచ్చు. అలా కాకుండా నార్మల్ చూపిస్తే హార్ట్ ఎటాక్ కావచ్చు, కాకపోవచ్చు కానీ వచ్చే అవకాశం ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ప్రయాణాలలో ఉన్నప్పుడు లేదా బయట ఎక్కడైనా ఉన్నప్పుడు హఠాత్తుగా గుండె దగ్గర నొప్పి లాంటిది వస్తుందనుకుంటే అప్పుడు వెంటనే ఎకోస్ప్రిల్ గోల్డ్ టాబ్లెట్ ఒకటి వేసుకుంటే కాస్త రిలీఫ్ ఇస్తుంది. తరువాత వెంటనే నడవకూడదు. ఎందుకంటే గుండెపై ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది.

ఒకవేళ గుండె నొప్పి వచ్చి కిందపడి స్పృహ కోల్పోయినట్లయితే అప్పుడు ప్రధమ చికిత్స ను చాలా జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. మన చుట్టుపక్కల ఎవరైనా గుండెలో నొప్పి అని నాలుగు లేదా ఐదు నిమిషాలలో కిందపడి స్పృహ కోల్పోవడం మనం చూస్తుంటాం. అప్పుడు మొదటగా మనం శ్వాస తీసుకుంటున్నారా లేదా అని పరిశీలించాలి. తరువాత ముఖంపై నీళ్లు చల్లవచ్చు కానీ నీళ్లు త్రాగించకూడదు.

గుండెనొప్పి వచ్చి స్పృహ కోల్పోయిన వారికి శ్వాస లేనప్పుడు ఒక షాక్ లాగా పిడికిలితో గట్టిగా గుండె మధ్య భాగంలో గుద్ది నట్లయితే తిరిగి గుండె కొట్టుకోవడం జరుగుతుంది. తరువాత రెండు చేతులతో గుండెను ఒక 30 సార్ల వరకు నొక్కడం, రెండు మూడుసార్లు నోటి ద్వారా గట్టిగా శ్వాసను అందించడం. ఇలా కంటిన్యూగా చేయడం వల్ల గుండెనొప్పి వచ్చిన వారిని కాపాడవచ్చు.