శరీరంలో ఈ మూలకం లోపిస్తే ఇంత ప్రమాదమా! ఈ లోపాన్ని సవరించే మార్గాలు ఇవే!

మనలో ఇమ్యూనిటీ శక్తి పెంపొందించడంలో విటమిన్ సి ఆవశ్యకత ఎంత ఉందో జింక్ మూలకం యొక్క ఆవశ్యకత కూడా అంతే. మన శరీరంలో జింక్ మూలకం లోపిస్తే నాడీ వ్యవస్థలో లోపాలు తలెత్తి జీవక్రియలు మందగిస్తాయి తద్వారా అల్జీమర్, మానసిక రుగ్మతలు, రుచి వాసనను గ్రహించలేకపోవడం మరియు చర్మం, గుండె , ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీ అవయవాల పనితీరులో జింక్ మినరల్ కీలకపాత్ర పోషిస్తుంది.
న్యూట్రిషన్ నిపుణుల అభిప్రాయం ప్రకారం పురుషులకు రోజుకు11 మి.గ్రా,స్త్రీలకు రోజుకు 8 మి.గ్రా జింక్ జింక్ అవసరం.అలాగే గర్భిణీ మహిళలకు,పాలిచ్చే తల్లులకు12మి.గ్రా జింక్ అవసరం అవసరం అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

జింక్ మూలకం పుష్కలంగా లభించే ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక కప్పు చిక్కుడు జాతి గింజల్లో దాదాపు 4.7 మి.గ్రా జింక్ లభ్యమవుతుంది. మరియు మన శరీరానికి శక్తినిచ్చే ప్రోటీన్స్ ఫైబర్ పుష్కలంగా లభించి లభించి క్యాలరీలు కొవ్వు పదార్థాలు అత్యల్పంగా లభిస్తాయి. కావున రోజు వారి ఆహారంలో వీటిని తప్పనిసరిగా తీసుకోవాలి.

జింక్ లోపంతో బాధపడేవారు రోజువారి డైట్ లో గుమ్మడి గింజలు మరియు పుచ్చగింజలను ఆహారంగా తీసుకోవచ్చు.గుమ్మడి గింజల్లో మన శరీరానికి అవసరమైన జింక్ లభించడంతోపాటు ప్లాంట్ ఆధారిత ప్రోటీన్ లభ్యమయి క్యాన్సర్ వ్యాధిని నివారించడంలో సహాయపడుతుంది. మరియు గుమ్మడి గింజల్లో ఉండే మెలటోనిన్ హార్మోన్ మానసిక ప్రశాంతతను కలిగించి నిద్రలేని సమస్యలను దూరం చేస్తుంది. అలాగే పుచ్చగింజల్లో దాదాపు 4 మి.గ్రా జింక్ మూలకం లభిస్తుంది .

రోజువారి ఆహారంలో పెరుగును తింటే 2మి.గ్రా జింక్ మూలకం లభ్యమవుతుంది. కావున రోజు వారి ఆహారంలో పెరుగును తింటే జింకు లోపాన్ని సరి చేసుకోవచ్చు. అలాగే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ , జింక్ తో పాటు అన్ని రకాల మూలకాలు సహజ పద్ధతిలో లభిస్తాయి. సెనగ గింజల్లో అత్యధికంగా జింక్ మూలకం లభ్యమవుతుంది. వీటిని ఉడకబెట్టుకొని ఉదయం సాయంత్రం స్నాక్స్ రూపంలో తీసుకోవచ్చు.