సాధారణంగా కొంతమంది మహిళలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తే మరి కొందరు మాత్రం ఆరోగ్యానికి సంబంధించి పెద్దగా జాగ్రత్తలు తీసుకోరు. ప్రస్తుత కాలంలో మహిళలను ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. కీళ్ల నొప్పులు, ఎముకల నొప్పులతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు మహిళలను వేధిస్తున్నాయి. శరీరంలో కొన్ని పోషకాలు లోపించినా మహిళలకు నష్టం కలుగుతుంది.
ఇంటినుంచి పని చేసే మహిళల్లో చాలామంది డి విటమిన్ లోపంతో బాధ పడుతున్నారు. డి విటమిన్ లోపంతో బాధ పడే మహిళలను ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశాలు ఉంటాయి. డి విటమిన్ లోపం వల్ల ఇమ్యూనిటీ పవర్ తగ్గే ఛాన్స్ అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇమ్యూనిటీ పవర్ తగ్గితే ఇతర ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి.
తరచూ విపరితమైన అలసట వేధిస్తుంటే శరీరంలో షుగర్ లెవెల్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. షుగర్, బీపీ లెవెల్స్ ను తరచూ చెక్ చేసుకుంటే మంచిది. ఈ మధ్య కాలంలో మహిళలను థైరాయిడ్ సమస్య వేధిస్తోంది. థైరాయిడ్ లెవెల్స్ ను కూడా మహిళలు తరచూ చెక్ చేయించుకుంటే మంచిది. విటమిన్ డీ లోపం ఉన్న మహిళలను గుండె సంబంధిత సమస్యలతో పాటు కీళ్ల నొప్పులు, ఎముకల నొప్పులు ఉన్నాయి,
శరీరంలో డీ విటమిన్ లోపిస్తే విటమిన్ ట్యాబ్లెట్లను వాడటం ద్వారా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. కనీసం ఆరు నెలలకు ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి మనల్ని మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది.