ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ రిలేషన్ లో ఉండడం సర్వసాధారణంగా జరుగుతున్న అంశం అయితే చాలామంది ప్రేమలో ఉండే బ్రేకప్ చెప్పుకున్న తర్వాత ఎలాగో విడిపోతున్నాం కదా అనేసి సెక్స్ లో పాల్గొనడం జరుగుతుంది. బ్రేకప్ సెక్స్ అంటారు అయితే ప్రస్తుతం ఇది ట్రెండ్ అవుతుంది. చాలామంది రిలేషన్ లో ఉన్నవాళ్లు కొన్ని కారణాలవల్ల విడిపోతూ ఎలాగో విడిపోతున్నాం కదా అని సెక్స్ లోపాల్గొంటున్నారు అయితే ఇది చాలా ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు ఇలా బ్రేకప్ సెక్స్ కారణంగా ఎలాంటి ప్రమాదం జరుగుతుంది ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి అనే విషయానికి వస్తే….
బ్రేకప్ సెక్స్ కారణంగా మనం ఒకరితో మన రిలేషన్ బ్రేక్ చేసుకున్న తర్వాత వారితో సెక్స్ చేయడం వల్ల తిరిగి వారిపై ప్రేమ కలిగి అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. బ్రేకప్ తర్వాత గందరగోళంగా అనిపిస్తూ ఉంటుంది. విడిపోవాలా వద్దా.. అనేక తికమకలో పడిపోతారు. మనసు వద్దు అని చెప్పినా.. తప్పక విడిపోతూ ఉంటారు.ఇలా ఇద్దరు వారి రిలేషన్ నుంచి బ్రేకప్ చెప్పుకొని విడిపోయి తిరిగి మరొక్కరితో జీవితం పంచుకున్న తర్వాత కూడా ఇలా బ్రేకప్ సెక్స్ లో పాల్గొనడం వల్ల లైంగిక సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
బ్రేకప్ సెక్స్ సమయంలో ముఖ్యంగా అసురక్షిత సెక్స్‌లో లైంగికంగా సంక్రమించే ఇన్‌ఫెక్షన్లు సంక్రమించే ప్రమాదం ఉంది.బ్రేకప్ తర్వాత మానసిక సమస్యలను ఎదుర్కొనడానికి మళ్లీ మాజీలతో శృంగారంలో పాల్గొనడం లాంటివి చేస్తున్నారట. కానీ… వాటి వల్ల మరింత మానసిక సమస్యలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే వీలైనంత వరకు బ్రేకప్ తర్వాత ఎవరి దారి వారు చూసుకోవడం ఎంతో మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.