Home Health & Fitness 'డయాబెటీస్' ఉన్నవారు ఈ పండ్లు తినొచ్చా..!?

‘డయాబెటీస్’ ఉన్నవారు ఈ పండ్లు తినొచ్చా..!?

ప్రస్తుత రోజుల్లో డయాబెటిస్ వయసుతో సంబంధం ఉండటం లేదు. డయాబెటిస్ సోకితే ఏం తినాలి.. ఏం తినకూడదు.. ఎప్పుడు తినాలి.. అనే మీమాంశ అందరిలో ఉంటుంది. ఆహారంలో ఏది ఉత్తమం, పండ్లు విషయంలో కూడా అనుమానాలే ఉంటాయి. దీంతో అందరిలో గందరగోళమే ఉంటుంది. డయాబెటీస్ రోగుల రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణపై చూపే ఆహారం తీసుకోవడం ఉత్తమం. డయాబెటిస్ బారిన పడ్డవారు పండ్లు తినే విషయంలో కూడా కన్ఫ్యూజ్ అవుతూంటారు. కానీ.. వారు తాజా పండ్లు, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవచ్చనే అంటున్నారు నిపుణులు.

Df | Telugu Rajyam

అయితే.. భోజనంతో కలిపి పండ్లను తీసుకోకూడదని అంటున్నారు. లంచ్ కు డిన్నర్‌కు మధ్య ఉండే సమయంలో చిరు తిండ్లుగా పండ్లను తీసుకోవడం ఉత్తమం అంటున్నారు. దాల్చిన చెక్క పొడిని పండ్ల మీద చల్లుకుని తినడం ఉత్తమం మంచిది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నా అందులో చక్కెర ఉండకూడదు. పండ్లు తింటే అందులో ఫైబర్ నేరుగా శరీరానికి అందుతుంది. పచ్చిగా ఉన్న పండ్లు తింటే మరీ మంచిది. ఈ క్రమంలో ద్రాక్ష పండ్లు తినొచ్చా అంటే.. కేవలం నల్ల ద్రాక్ష మాత్రమే తినొచ్చుంటున్నారు నిపుణులు. ఇది రక్తంలోని గ్లూకోజ్‌ను నియంత్రిస్తుంది.

ప్రస్తుతం సీజనల్ ఫ్రూట్ గా మార్కెట్లో ఉన్న సీడ్‌లెస్ ద్రాక్షను కాఫీ కప్పు పరిమాణంలో తీసుకోవడం ఉత్తమమని అంటున్నారు. మిచిగాన్ యూనివర్శిటీ పరిశోధకులు దీనిని ధ్రువీకరిస్తున్నారు. వీటిని జ్యూస్ గా తీసుకోవాలంటే షుగర్ కలపకూడదని చెప్తున్నారు. బ్లూబెర్రీ, నల్లద్రాక్షతో కలిపి యాపిల్ పండ్లను తినడం మంచిదని.. టైప్-2 డయాబెటీస్‌ను తగ్గించేందుకు ఉపయోగపడుతుందని అమెరికన్ పరిశోధకులు అంటున్నారు.

లో-గ్లైసెమిక్ ఇండెక్స్ గల స్ట్రాబెర్రీస్‌, జామ పండ్లు డయాబెటీస్ ఉన్నవారికి మంచివి. స్ట్రాబెర్రీ ఇమ్యూనిటీని పెంచుతుంది. క్యాన్సర్ కణాలతో సైతం పోరాడే తత్వం దీనిలో ఉంది. జీవక్రియ సక్రమంగా ఉండేలా.. స్లిమ్ గా ఉండేలా చేస్తుంది. డయాబెటిస్ బాధితులకు జామ పండు చాలామంచిది. ఇందులో కూడా గ్లెసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. ఆకలితో ఉన్నప్పుడు జామ పండ్లు తినడం ఉత్తమం.
పుచ్చకాయ మూత్రపిండాలకు మేలు చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి నరాలను ఉత్తేజితం చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఉండే బొప్పాయి కూడా మంచిదే. ఆరెంజ్ కూడా తీసుకోవచ్చంటున్నారు నిపుణులు.

 

గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. మీకు ఎటువంటి అనారోగ్యం ఉన్నా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. వైద్యులు లేదా ఆహార నిపుణులను సంప్రదించి వారు సూచించిన ఆహారాన్నే తీసుకోండి. ఈ సమాచారం ఆయా సందర్భాల్లో ఆహార నిపుణులు చెప్పినదే ఇచ్చాం. పైన ఇచ్చిన సమాచారమే ప్రామాణికంగా తీసుకోరాదని మనవి.

- Advertisement -

Related Posts

రోగనిరోధక శక్తి పెరగాలంటే ఆహారంలో ఇవి కూడా ఉండాల్సిందే..!!

ప్రస్తుతం కరోనా అందరినీ కలవరపెడుతోంది. దీంతో యోగా, వ్యాయామం, నడక, సైక్లింగ్.. ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు. రోగనిరోధక వ్యవస్థను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజా, పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటున్నారు. దీనివల్ల మన రోగ...

సమ్మర్ బాడీ హీట్ తగ్గాలంటే సబ్జా పడాల్సిందే..!

వేసవి వచ్చిందంటే బాడీ హీటెక్కిపోతూ ఉంటుంది. కాసేపు ఎండలో ఉన్నా చాలు సూరీడి వేడి సెగలా తగులుతుంది. ఇక బయటకు వెళ్తే ఉక్కపోత. నోరు దాహం.. దాహం అంటుంది. శరీరం చల్లదనాన్ని కోరుకుంటుంది....

బార్లీ నీళ్లు తాగితే లాభాలేంటి..? అధిక బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందా..?

ఒంట్లో వేడి చేసిన వారు, ఆరోగ్యం కోసం శ్రద్ధ వహించేవారు గతంలో బార్లీ గింజలు కాచి తాగేవారు. శరీరానికి ఎంతో చలవ చేస్తుంది. వైద్యులే కాదు.. పెద్దలు కూడా చెప్పే మాట. అయితే.....

Latest News